Chandramohan: చంద్రమోహన్.. మరణానికి అసలు కారణాలు ఇవే!

By Surya Prakash  |  First Published Nov 11, 2023, 5:08 PM IST

చంద్రమోహన్ మరణానికి కారణం ఏమిటి ..అంత హటాత్తుగా ఆయన మరణించటం ఏమిటి అసలు కారణం ఏమిటనేది అభిమానులకు అంతు చిక్కటం లేదు.



దాదాపు ఐదున్న‌ర ద‌శాబ్దాల పాటు అనేక ర‌కాల పాత్ర‌ల‌తో.. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప్రేక్ష‌కుల హృద‌యాల‌పై చెర‌గ‌ని ముద్ర వేసిన ఆ న‌వ్వు ముఖం న‌టుడు చంద్రమోహన్ ఇక లేరు. ఆయన మరణవార్తకు చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు చలించిపోయి సంతాపం తెలియచేస్తున్నారు. తమ అనుభవాలను షేర్ చేస్తున్నారు. చంద్రమోహన్ చికిత్స పొందుతూ హైదరబాద్ అపొలో హాస్పిటల్‌లో నవంబర్ 11న తుది శ్వాస విడిచారు. అయితే, చంద్రమోహన్ మరణానికి కారణం ఏమిటి ..అంత హటాత్తుగా ఆయన మరణించటం ఏమిటి అసలు కారణం ఏమిటనేది అభిమానులకు అంతు చిక్కటం లేదు.

Also Read ‘మనిషిని మనిషిగా ప్రేమించే వ్యక్తి’.. చంద్రమోహన్ కు సీఎం, చిరు, పవన్, ఎన్టీఆర్, సెలబ్రెటీల నివాళులు..

Latest Videos

చంద్రమోహన్ మరణానికి గల కారణాలను ఆయన బంధువు, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తాజాగా మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..."చంద్రమోహన్ గారు నాకు స్వయానా మేనమామ. నాలుగేళ్ల నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆ పరిస్థితుల్లోనే కిడ్నీ సమస్య కూడా తలెత్తింది. ఈరోజు (నవంబర్ 11) ఉదయం సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు చనిపోయారని నిర్ధరించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఒక అమ్మాయి చెన్నై నుంచి, మరో కూతురు అమెరికా నుంచి రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత సోమవారం (నవంబర్ 13) అంత్యక్రియలు నిర్వహిస్తాం" అని శివలెంక కృష్ణప్రసాద్ వెల్లడించారు.

2004లో `రాఖీ` సినిమా పూర్త‌యిన వెంట‌నే చంద్ర‌మోహ‌న్ బైపాస్ స‌ర్జ‌రీ చేయించుకున్నారు. ఆ త‌ర్వాత `దువ్వాడ జ‌గ‌న్నాధమ్` సినిమా టైమ్ లోనే ఆరోగ్య‌ప‌రంగా ఇబ్బందులు ఎదుర్కున్నారు. చివ‌రిగా గోపీచంద్ హీరోగా న‌టించిన `ఆక్సిజ‌న్` సినిమా త‌ర్వాత సినిమాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు.
 
ఇక చంద్రమోహన్ తన ఆరోగ్యం గురించి ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ..."నా ఆరోగ్యం గురించి ఎవరు హెచ్చరించినా ఇనుముకు చెదలు పడుతుందా, నాది ఉక్కు శరీరం అంటూ వెటకారం చేసేవాడిని. కానీ, తర్వాతే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆలస్యంగా తెలుసుకున్నాను. అప్పుడే అసలు విషయం అర్థమైంది" అని చంద్రమోహన్ తన ఆరోగ్యం గురించి చెప్పుకొచ్చారు. 

click me!