మమ్మల్ని క్షమించు సుజిత్ అంటున్న సమంత.. గుండె బద్దలైందన్న మరో నటి!

Published : Oct 29, 2019, 06:21 PM ISTUpdated : Oct 29, 2019, 06:23 PM IST
మమ్మల్ని క్షమించు సుజిత్ అంటున్న సమంత.. గుండె బద్దలైందన్న మరో నటి!

సారాంశం

బోరుబావిలో పడ్డ తమిళనాడు తిరుచ్చి జిల్లాకు చెందిన రెండేళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. రెస్క్యూ బృందాలు, అధికారులు సుజిత్ ని రక్షించే క్రమంలో సహాయ చర్యలు చేపట్టారు. మొదట సుజిత్ 27 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కానీ 70 అడుగుల లోతుకు జారిపోవడంతో అతడిని రక్షించడం కష్టమైంది. 

చివరకు రెస్క్యూ బృందాలు చిన్నారిసుజిత్ మృత దేహాన్ని బయటకు తీశారు. బోరు బావిలో బాగా లోతులో సుజిత్ జారిపడడం, సహాయచర్యలు వేగంగా సాగకపోవడం, పలు మార్లు అతడిని రక్షించే ప్రయత్నాలు విఫలం కావడం వల్ల సుజిత్ మరణించాడు. 

సుజిత్ మరణం అందరిని విషాదంలో ముంచేసింది. చిత్ర పరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలంతా సుజిత్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మొదట సుజిత్ 27 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కానీ 70 అడుగుల లోతుకు జారిపోవడంతో అతడిని రక్షించడం కష్టమైంది. 

దాదాపు 6 రెస్క్యూ బృందాలు మూడు రోజుల పాటు తీవ్రంగా శ్రమించినా సుజిత్ ని రక్షించడం వీలు కాలేదు. చిత్ర పరిశ్రమకు చేసిన పలువురు ప్రముఖులు సుజిత్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. 

స్టార్ హీరోయిన్ సమంత 'మమ్మల్ని క్షమించు సుజిత్' అని ట్వీట్ చేసింది. మరో హీరోయిన్ ప్రణీత సుభాష్ ట్వీట్ చేస్తూ.. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం, మన మేధస్సు ఏవీ సుజిత్ ని రక్షించలేకపోయాయి. నా హృదయం బద్దలయింది అని ప్రణీత ట్విట్టర్ లో పేర్కొంది. 

తమిళనాడు బోరు బావి ప్రమాదం: సుజిత్ కథ విషాదాంతం

అన్యం పుణ్యం ఎరుగని చిన్నారి సుజిత్ కు నా సంతాపం తెలుపుతున్నా. ఇప్పటికే చాలా మంది చిన్నారులని ఇలా కోల్పోయాం. ఇకమీదట ఇలాంటివి జరగకూడదు అని విశాల్ తెలిపాడు. 

చిట్టితండ్రి మమ్మల్ని క్షమించు.. సుజిత్ ఆత్మకు శాంతి చేకూరాలి అని రజనీకాంత్ కుమార్తె సౌందర్య సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?