సినిమా ఆలస్యం.. థియేటర్ పై కేసు నమోదు

Published : Oct 16, 2019, 08:30 AM IST
సినిమా ఆలస్యం.. థియేటర్ పై కేసు నమోదు

సారాంశం

ఇటీవల విడుదలైన గోపీచంద్ చాణక్య సినిమా కెపిహెచ్ బి పరిధిలోని మంజీరమాల్ సినీ పోలీస్ లో ప్రదర్శింపబడింది.  అయితే సినిమా అనుకున్న సమయం ప్రకారం 4.40 నిమిషాలకు ప్రారంభం కావాలి. కానీ థియేటర్ యాజమాన్యం 10 నిమిషాలు ఆలస్యంగా స్టార్ట్ చేసింది.

సినిమా థియేటర్ పై ఓ ప్రేక్షకుడు అసహనంతో కేసు వేశాడు. సినిమా ఆలస్యంగా  ప్రదర్శించడంతో సమయం వృధా చేసినందుకు గాను పోలీసులకు పిర్యాదు చేయడం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల విడుదలైన గోపీచంద్ చాణక్య సినిమా కెపిహెచ్ బి పరిధిలోని మంజీరమాల్ సినీ పోలీస్ లో ప్రదర్శింపబడింది.

అయితే సినిమా అనుకున్న సమయం ప్రకారం 4.40 నిమిషాలకు ప్రారంభం  కావాలి కానీ థియేటర్ యాజమాన్యం 10 నిమిషాలు ఆలస్యంగా స్టార్ట్ చేసింది. ఆ సమయంలో యాడ్స్ ని ప్రదర్శించారు. దీంతో చిరాకుతో ఒక ప్రేక్షకుడు కేసు వేశాడు. ఈ నెల 8న పోలీసులకు ఈ విషయంపై పిర్యాదు అందింది. ప్రేక్షకుల సమయాన్ని అనవసరంగా వృధా చేశారని నిబంధనలను సైతం ఉల్లంఘించారని ఆరోపించారు.

దీంతో కేపీహెచ్ బి  పోలీసులు కోర్టు నుంచి అనుమతి రావడంతో కేసు నమోదు చేశారు. అక్టోబర్ 5న విడుదలైన గోపీచంద్ చాణక్య సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. తీరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించగా అనిల్ సుంకర సినిమాను నిర్మించారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?