హిట్టుకొట్టినా.. అడ్వాన్సులు వెనక్కి ఇవ్వక తప్పలేదు!

prashanth musti   | Asianet News
Published : Dec 25, 2019, 02:57 PM IST
హిట్టుకొట్టినా.. అడ్వాన్సులు వెనక్కి ఇవ్వక తప్పలేదు!

సారాంశం

సక్సెస్ అయితే దర్శకులకు బడా ప్రొడ్యూసర్స్ ని ఆఫర్స్ రావడం కామన్. ఎక్కడ మిస్ అవుతారో ఏమో అని ముందే అడ్వాన్సులు ఇచ్చి మరి నెక్స్ట్ సినిమా మా బ్యానర్ లోనే చేయాలనీ ఒప్పందం కుదుర్చుకుంటారు

ఒక సినిమా సక్సెస్ అయితే దర్శకులకు బడా ప్రొడ్యూసర్స్ ని ఆఫర్స్ రావడం కామన్. ఎక్కడ మిస్ అవుతారో ఏమో అని ముందే అడ్వాన్సులు ఇచ్చి మరి నెక్స్ట్ సినిమా మా బ్యానర్ లోనే చేయాలనీ ఒప్పందం కుదుర్చుకుంటారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ కి కూడా గత కొన్ని నెలలుగా అలాంటి ఆఫర్సే వచ్చాయి.

గీతగోవిందం సినిమా ఇటీవల కాలంలో అత్యధిక లాభాల్ని అందించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. దీంతో పరశురామ్ కి బడా బ్యానర్స్ నుంచి మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు బివిఎస్ఎన్.ప్రసాద్  వంటి వారు పరశురామ్ కి అడ్వాన్సులు కూడా ఇచ్చారట. సినిమా చేస్తానని కథలను సెట్ చేసుకున్న పరశురామ్ పెద్ద హీరోలని మెప్పించలేకపోయాడు.

దీంతో చివరికి నాగ చైతన్యతో ఒక సినిమాని ఫిక్స్ చేసుకున్నాడు.  ఇక ఇప్పటికే ఆలస్యం కావడంతో నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్సులను వెనక్కి ఇచ్చేశాడట. కొందరు నిర్మాతలు పరవాలేదు అడ్వాన్సులు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆలస్యమయినా సరే మంచి కథలను సెట్ చేసుకొమ్మని చెప్పారట.

అయినప్పటికీ పరశురామ్ వారి మాటలు పట్టించుకోకుండా అడ్వాన్సులు ఇచ్చేశారట. ఇక నుంచి ఒక సినిమా అయిపోయిన తరువాతే మరో కథతో సెట్స్ పైకి వెళ్లాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట. ఏ మాత్రం అడ్వాన్సులు తీసుకోకూడదని అదొక అడ్వాన్స్ తలనొప్పి అని చెబుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వస్తోంది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?