పవన్, రాంచరణే కాదు.. చిరు కూడా.. మెగా ఫ్యామిలీకి అది తీరని కలే!

By tirumala ANFirst Published Oct 15, 2019, 8:19 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి విజయంగా రికార్డు క్రియేట్ చేస్తోంది. రాంచరణ్ రంగస్థలం పేరిట ఉన్న నాన్ బాహుబలి రికార్డులని సైరా చిత్రం చెరిపివేస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా సైరా మూవీ అక్టోబర్ 2న విడుదలైన సంగతి తెలిసిందే. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా చిత్రం అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నరసింహారెడ్డి పాత్రలో జీవించారు. తెలుగు రాష్ట్రాల్లో సైరా చిత్రం 100 కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టింది. బాహుబలి తర్వాత టాలీవుడ్ లో అతిపెద్ద విజయంగా అవతరించింది. 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించాడు. సైరా చిత్రం చిరంజీవి దశాబ్దాలుగా కంటున్న కల. ఆ కల ఎట్టకేలకు సాకారం అయింది. సైరా తెలుగు వర్షన్ తిరుగులేని విజయమే. కానీ హిందీ వర్షన్ పరిస్థితి ఏంటి.. అక్కడ కూడా పెద్దఎత్తున సైరా చిత్రాన్ని రిలీజ్ చేశారు. 

సైరా చిత్రానికి క్రిటిక్స్ మంచి రివ్యూలు ఇచ్చారు.. టాక్ కూడా బాగా వచ్చింది. కానీ హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రం పట్ల ఆసక్తి చూపలేదు. 25 కోట్ల వరకు హిందీ హక్కులు అమ్ముడయ్యాయి. కానీ సైరా చిత్రం ఇప్పటివరకు 12 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. దీనితో హిందీలో సైరా మూవీ ఫ్లాఫ్ గానే మిగిలిపోనుంది. 

బాలీవుడ్ లో సక్సెస్ మెగా ఫ్యామిలీకి కలగానే మిగిలిపోయింది. మెగాస్టార్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ప్రతిబంధ్, ఆజ్‌కా గూండారాజ్ లాంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. అక్కడ మెగాస్టార్ కు పెద్దగా గుర్తింపు లభించలేదు. 

రాంచరణ్ జంజీర్ చిత్రంతో బాలీవుడ్ లో చేసిన ప్రయత్నం తీవ్రంగా నిరాశపరిచింది. జంజీర్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేశాడు. సర్దార్ కూడా ఫ్లాప్ అయింది. ఈ సారి మెగాస్టార్ భారీ హంగులతో సైరా చిత్రంతో రంగంలోకి దిగాడు. ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు. 

సైరా చిత్రం బావున్నప్పటికీ హిందీలో ఈ చిత్రానికి బజ్ లేదు. దీనికి తోడు చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని తూతూ మంత్రంగా ముగించింది. అందువల్లే సైరాకు అక్కడ ఈ రకమైన రిజల్ట్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

click me!