Bigg Boss 3: మాజీ కంటెస్టంట్స్ డాన్స్ లతో ఫినాలే స్టార్ట్

Published : Nov 03, 2019, 06:13 PM ISTUpdated : Nov 03, 2019, 06:17 PM IST
Bigg Boss 3: మాజీ కంటెస్టంట్స్ డాన్స్ లతో ఫినాలే స్టార్ట్

సారాంశం

ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే అంతే గ్రాండ్ గా మొదలైంది. భారీ స్థాయిలో భారీ ఏర్పాట్లతో షోని మొదలుపెట్టారు. ముందుగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ అందరూ తమ డాన్స్ లతో షోని మొదలుపెట్టారు

బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. టైటిల్ విన్నర్ ఎవరనే విషయం మరికాసేపట్లో తెలియనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రాహుల్‌ సిప్లిగంజ్‌ విన్నర్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే అంతే గ్రాండ్ గా మొదలైంది.

భారీ స్థాయిలో భారీ ఏర్పాట్లతో షోని మొదలుపెట్టారు. ముందుగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ అందరూ తమ డాన్స్ లతో షోని మొదలుపెట్టారు. ఒక్కొక్కరి డాన్స్ పెర్ఫార్మన్స్ పూర్తయిన తరువాత నాగర్జున 'మనం' సాంగ్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. కింగ్ స్టేజ్ మీదకి రాగానే మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా స్టేజ్ పైకి వచ్చి డాన్స్ లు చేశారు.

ఇక ఈ షోలో టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలు రాశీఖన్నా, అంజలిలు రాబోతున్నారు. అలానే దర్శకుడు మారుతి, సీనియర్‌ హీరో శ్రీకాంత్‌ లు కూడా వచ్చారు. ప్రస్తుతం హౌజ్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖి, వరుణ్‌, బాబా భాస్కర్‌, అలీ రెజాలు ఉన్నారు.

అయితే వీరిలో రాహుల్, శ్రీముఖిల మధ్య టైటిల్‌ విషయంలో గట్టి పోటి కనిపిస్తోంది. ఇప్పటికే రాహుల్ విన్నర్‌, శ్రీముఖి రన్నరప్‌ అని ప్రచారం జరుగుతున్న ఈ విషయం అధికారికంగా కన్ఫర్మ్ కావాలంటే మాత్రం ఈ రోజు షో ముగిసే వరకు వెయిట్‌ చేయాల్సిందే.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?