బిగ్ బాస్ 3: హౌస్ మేట్స్ తో నాగ్ దసరా సంబరాలు!

Published : Oct 09, 2019, 08:03 AM IST
బిగ్ బాస్ 3: హౌస్ మేట్స్ తో నాగ్ దసరా సంబరాలు!

సారాంశం

 బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 79 ఎపిసోడ్‌లను పూర్తి చేసి మంగళవారం నాటితో 80వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.  

బిగ్ బాస్ స్టేజ్ పై శని, ఆదివారాల్లో కనిపించే నాగార్జున దసరా కానుకగా మంగళవారం నాడు హౌస్ లోకి స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి దసరా సందర్భంగా ఓ టాస్క్ ఇచ్చారు. ఫుడ్ మేళాలో భాగంగా వివిధ రకాల వంటలను చేయాలని చెప్పారు.

ఈ క్రమంలో హౌస్ మేట్స్ ని రెండు టీంలుగా విడగొట్టి రకరకాల వంటలు చేయాలని ఆదేశించారు. వారు చేసిన స్వీట్ ఐటెమ్ రుచి చూడడానికి ఓ స్పెషల్ గెస్ట్ హౌస్ లోకి రాబోతున్నారని బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి చెప్పారు. ఎవరొస్తారని ఎదురుచూస్తుండగా.. నాగార్జున ఎంట్రీ ఇచ్చారు.

నాగ్ ని చూసిన హౌస్ మేట్స్ ఈలలు, కేకలు వేస్తూ అల్లరి చేశారు. నాగార్జున ఒక్కొక్కరినీ పేరు పేరునా పలకరించారు. అనంతరం నాగ్ ని నులక మంచం మీద కూర్చోబెట్టి తమ వంటకాలను రుచి చూపించారు. 'నా కోసం మంచం కూడా వేశారా? వేరీజ్ రమ్యా?' అంటూ నాగార్జున జోక్ చేశారు.

ఆ తరువాత రెండు గ్రూప్ లు చేసిన స్వీట్స్ తిని మహిళల టీమ్ చేసిన స్వీట్ బాగుందని చెప్పడంతో బాబా భాస్కర్ అలిగారు. హౌస్ మేట్స్ కోసం తీసుకొచ్చిన స్వీట్స్, గిఫ్ట్స్ వారికి అందించారు నాగార్జున. ఈ ఎపిసోడ్ బుధవారం నాడు కూడా కంటిన్యూ అవ్వనుంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?