బాలకృష్ణ మళ్ళీ అదే ఫార్మాట్.. స్టైల్ ప్లస్ మాస్?

Published : Oct 24, 2019, 02:05 PM IST
బాలకృష్ణ మళ్ళీ అదే ఫార్మాట్.. స్టైల్ ప్లస్ మాస్?

సారాంశం

షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ పనులు త్వరగా ముగించుకున్న బాలకృష్ణ తన కోసం వచ్చిన అభిమానుల్ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. అలాగే తన నియోజకవర్గమైన హిందూపూర్ ప్రజల్ని కూడా కలుసుకున్నారు.  వారితో కొన్ని ఫోటోలకు స్టిల్ ఇచ్చి పలు విషయాలపై చర్చించారు. అయితే బాలయ్య లుక్ చూస్తుంటే సినిమాలో డబుల్ షేడ్స్ లో దర్సనమివ్వనున్నట్లు తెలుస్తోంది. 

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోంది. ఇక ఇటీవల షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ పనులు త్వరగా ముగించుకున్న బాలకృష్ణ తన కోసం వచ్చిన అభిమానుల్ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. అలాగే తన నియోజకవర్గమైన హిందూపూర్ ప్రజల్ని కూడా కలుసుకున్నారు.  

వారితో కొన్ని ఫోటోలకు స్టిల్ ఇచ్చి పలు విషయాలపై చర్చించారు. అయితే బాలయ్య లుక్ చూస్తుంటే సినిమాలో డబుల్ షేడ్స్ లో దర్సనమివ్వనున్నట్లు తెలుస్తోంది. డబుల్ యాక్షన్ అనే టాక్ కూడా వస్తోంది. గతంలో బాలయ్య ఈ ఫార్మాట్లో మంచి సక్సెస్ అందుకున్నాడు. స్టైలిష్ లుక్ తో పాటు తన అభిమానులను ఆకట్టుకునే విధంగా మరో లుక్ ని కూడా ట్రై చేసినట్లు అర్ధమవుతోంది. ఇక షూటింగ్ ఇప్పటికే ఎండింగ్ కు వచ్చేసింది.

 

మరో షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు. కెఎస్. రవికుమార్ దర్శకత్వంలో గతంలో బాలయ్య నటించిన జై సింహా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు మరోసారి వారి కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ వస్తుండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు లుక్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచడం స్టార్ట్ చేశాయి. సినిమాకు రూలర్ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?