చిన్నారి అభిమాని మృతి.. షాక్ లో బాలయ్య.. ఎమోషనల్ మెసేజ్!

Published : Oct 18, 2019, 04:58 PM ISTUpdated : Oct 18, 2019, 05:10 PM IST
చిన్నారి అభిమాని మృతి.. షాక్ లో బాలయ్య.. ఎమోషనల్ మెసేజ్!

సారాంశం

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఎంతో భవిష్యత్తు ఉన్న బుల్లితెర ఆర్టిస్ట్ గోకుల్ డెంగ్యూ జ్వరం కారణంగా బెంగుళూరులో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. 

బుల్లితెరపై నటుడిగా మంచి ప్రతిభని గోకుల్ ప్రదర్శించాడు. గోకుల్ నందమూరి బాలకృష్ణకు అభిమాని. బాలయ్య డైలాగులు చెప్పడం అంటే ఈ చిన్నారికి చాలా ఇష్టం. గత కొన్ని రోజులుగా గోకుల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. దీనితో అతడి తల్లిదండ్రులు బెంగుళూరులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. 

అక్కడ చికిత్స పొందుతూ గోకుల్ గురువారం రాత్రి మరణించాడు. తన అభిమాని గోకుల్ మరణించాడని తెలియగానే బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు. గోకుల్ మృతి చెందడంతో బాలయ్య ఎమోషనల్ గా ఓ సందేశాన్ని విడుదల చేశారు. 'అభిమానుల కంటే మాకు ఏదీ విలువైనది లేదు. 

నేనంటే ప్రాణం ఇచ్చే చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడనే నిజం నన్ను కలచివేసింది. అతడు డైలుగులు చెప్పే విధానం, హావభావాలు నాకు ఎంతో ముచ్చట కలిగించాయి. ఎంత భవిష్యత్తు ఉన్న గోకుల్ చిన్న వయసులోనే మరణించడం చాలా బాధని కలిగించే విషయం. గోకుల్ కుటుంబ సభ్యులకు నా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నా బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. 

గోకుల్ గతంలో బాలకృష్ణని కలుసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య డైలాగులంటే ఇష్టపడే గోకుల్ పలు వేదికలపై వాటిని చెప్పేవాడు. 

డెంగ్యూ ఫీవర్‌తో బాలనటుడు మృతి

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?