''చిరంజీవి గిరంజీవి.. బాలయ్య ముందు సరిపోరు''

Published : Oct 22, 2019, 10:26 AM ISTUpdated : Oct 22, 2019, 12:20 PM IST
''చిరంజీవి గిరంజీవి.. బాలయ్య ముందు సరిపోరు''

సారాంశం

 టాలీవుడ్లో గుర్రపుస్వారీ విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణను మించిన వారు ఇంకొకరు లేదని అంటున్నారు. 

మెగాస్టార్  చిరంజీవి తన 64 ఏళ్ల వయసులో రీసెంట్ గా చేసిన  ‘సైరా’ సినిమాలో  గుర్రపుస్వారీలో తన నైపుణ్యాన్ని మరోసారి చూపించారు. అయితే సీనియర్ కమెడియన్ బాబూ మోహన్ మాత్రం అది ఒప్పుకునేటట్లు కనపడటం లేదు.  టాలీవుడ్లో గుర్రపుస్వారీ విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణను మించిన వారు ఇంకొకరు లేదని అంటున్నారు.

ఈ మేరకు ఆయన మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది. ఆ వీడియోలో తన ఆఫీసులో క్యాజువల్ గా  మాట్లాడుతూ ఆయన బాలయ్య గుర్రపుస్వారీ నైపుణ్యం గురించి చెప్పుకొచ్చారు.

బాబు మోహన్ మాట్లాడుతూ...‘‘భైరవద్వీపం సినిమాలో బాలకృష్ణ, నేను గుర్రం మీద వెళ్తాం. బాలకృష్ణ మొనగాడు గుర్రం నడపడంలో. ఆడతాడు గుర్రాలతో. ఎగిరి దూకుతుంటాడు. నిజంగా.. బాలకృష్ణ లాగా ఎవ్వరూ.. చిరంజీవి గిరంజీవి ఎవ్వరూ గుర్రం నడపజాలరు. ఏం పట్టుకోకుండా... కేవలం జూలు మాత్రమే పట్టుకుని పోతుంటాడు’’ అంటూ నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు బాబూ మోహన్.

అలాగే చివర్లో ... ''తీటగాడు.. నేను తోకవైపు కూర్చుని నడుపుతుంటే.. నన్నొక తన్ను తన్నాడు'' అని బాబూ మోహన్ అన్నారు.  అయితే తీటగాడు అన్నది ప్రేమగా, అభిమానంతో  అన్న పదం కావటంతో ఎవరూ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. దాంతో చాలా మంది మెగాభిమానులు..  మెగాస్టార్ చిరంజీవి గతంలో ‘కొదమసింహం’, ‘కొండవీటి దొంగ’ లాంటి సినిమాల్లో ఆయన ఎంత స్టైయిల్ గా  గుర్రాన్ని నడిపించాడో..  గుర్తు చేస్తున్నారు. ఇది కేవలం బాబు మోహన్ పాయింటాఫ్ వ్యూ మాత్రమే అని అంటున్నారు.

 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?