బట్టతలతో బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టిన యువ హీరో

Published : Nov 09, 2019, 12:54 PM ISTUpdated : Nov 09, 2019, 01:00 PM IST
బట్టతలతో బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టిన యువ హీరో

సారాంశం

ఆయుష్మాన్ ఖురానా మరోసారి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో షాకిచ్చాడు. ప్రతి సినిమాతో ఎదో ఒక కొత్త పాయింట్ ని ఎలివేట్ చేసి ఆకట్టుకునే ఈ స్టార్ హీరో ఇప్పుడు బట్టతలతో మరో కెరీర్ బెస్ట్ రికార్డ్ అందుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయుష్మాన్ బాలా అనే సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

బాలీవుడ్ యువ హీరో ఆయుష్మాన్ ఖురానా మరోసారి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో షాకిచ్చాడు. ప్రతి సినిమాతో ఎదో ఒక కొత్త పాయింట్ ని ఎలివేట్ చేసి ఆకట్టుకునే ఈ స్టార్ హీరో ఇప్పుడు బట్టతలతో మరో కెరీర్ బెస్ట్ రికార్డ్ అందుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయుష్మాన్ బాలా అనే సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

బట్టతలతో యువకులు ఎదుర్కొనే సమస్యలు అలాగే దాన్ని కవర్ చేయడానికి పడే పాట్లు సినిమాలో చాలా రియాలిటీగా చూపించారు.  అయితే సినిమా మొదటిరోజు  10కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది. సినిమా ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు యువ హీరో గత సినిమాల ప్రభావం వల్ల బాలా సినిమాపై అంచనాలు పెరిగాయి.

also read: ఈ సినిమాలు హిట్టన్నారు.. లాభాలెక్కడ?

రెండు నెలల కిందట ఆయుష్మాన్ నుంచి వచ్చిన డ్రీమ్ గర్ల్ సినిమా కూడా బాక్స్  ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంది.  దాదాపు 200కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఆ సినిమా 20కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక ఇప్పుడు బాలా సినిమా కూడా అదే తరహాలో కలెక్షన్స్ అందుకునేలా ఉంది. సినిమాకు సంబందించిన టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది.

సినిమాలో కామెడీతో పాటు ఎమోషనల్ యాంగిల్ ని కూడా గట్టిగానే టచ్ చేశారు. దర్శకుడు అమర్ కౌశిక్ కథను డీల్ చేసిన విధానం అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. మరి సినిమా వీకెండ్ అనంతరం ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.  ఆయుష్మాన్ గతంలో చేసిన సినిమాలు చాలా వరకు మొదటిరోజు స్లోగా కలెక్షన్స్ ని రాబట్టి వీకెండ్ అనంతరం పాజిటివ్ టాక్ తో ఉపందుకునేవి.

కానీ ఆర్టికల్ 15నుంచి ఈ హీరో మొదటిరోజే 5కోట్లకు పైగా కలెక్షన్స్ అనుకుంటున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వచ్చే దర్శకులను సెలెక్ట్ చేసుకొని సినిమాలు సెట్స్ పైకి తేవడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లో కథను చెబితే చాలు వెంటనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. మొత్తానికి బాలా సినిమాతో సక్సెస్ అందుకున్న ఆయుష్మాన్ మరో రెండు డిఫరెంట్ సినిమాలతో రెడీ అవుతున్నాడు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?