యూఎస్ పాలిటిక్స్ పై హాలివుడ్ హీరో ఘాటు వ్యాఖ్యలు

Published : Oct 21, 2019, 09:03 AM IST
యూఎస్ పాలిటిక్స్ పై హాలివుడ్ హీరో ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

సీనియర్ యాక్టర్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తరచుగా ఎదో ఒక విషయంపై కాస్త ఘాటుగా వివరణ ఇచ్చే అయన ఈ సారి రాజకీయాలపై ఎవరు ఉహించని స్టేట్మెంట్ ఇచ్చారు. రాజకీయాలంటే తనకు అసహ్యమని చెబుతూ గవర్నర్ గా పని చేసినప్పటికీ ఒక పొలిటీషియన్ గా నడుచుకోలేదని అన్నారు.

టెర్మినటర్ సిరీస్ లతో హాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ యాక్టర్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తరచుగా ఎదో ఒక విషయంపై కాస్త ఘాటుగా వివరణ ఇచ్చే అయన ఈ సారి రాజకీయాలపై ఎవరు ఉహించని స్టేట్మెంట్ ఇచ్చారు. రాజకీయాలంటే తనకు అసహ్యమని చెబుతూ గవర్నర్ గా పని చేసినప్పటికీ ఒక పొలిటీషియన్ గా నడుచుకోలేదని అన్నారు.

2003 నుంచి 2011వరకు ఆర్నాల్డ్ కాలిఫోర్నియా గవర్నర్ గా పని చేశారు. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్నాల్డ్ రాజకీయాలపై మాట్లాడుతూ.. నేను పని చేసిన రోజుల్లో కేవలం ఒక ప్రజా సేవకుడిగానే రాజకీయాల్లో ఉన్నాను. పాలిటిక్స్ అంటే నాకు చాలా అసహ్యం. కేవలం ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వారికి సహాయపడే విధంగా అవసరమైన విధానాలను రూపొందించాను.  

నేను రాజకీయాల్లో రావడానికి ప్రధాన కారణం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే. మారేవిధమైన ఆలోచన లేదు. ఇక అమెరికా అధ్యక్ష పదవిపై మాట్లాడుతూ.. కేవలం ఆస్ట్రియన్ బ్యాక్‌గ్రౌండ్ కావడంతో అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడలేకపోతున్నందుకు విచారిస్తున్నట్లు అర్నాల్ వివరించారు. దీంతో అయన చేసిన వ్యాఖ్యలు అమెరికన్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ఆర్నాల్డ్ తన తదుపరి చిత్రం టెర్మినేటర్: డార్క్‌ ఫేట్’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. తెలుగులో కూడా ఆ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?