వైరల్ అవుతున్న అనుష్క మీమ్: లాక్ డౌన్ తొలి రోజు అలా.. చివరి రోజు ఇలా

Published : Apr 04, 2020, 10:27 AM IST
వైరల్ అవుతున్న అనుష్క మీమ్: లాక్ డౌన్ తొలి రోజు అలా.. చివరి రోజు ఇలా

సారాంశం

కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ దేశ ప్రజలకు 21 రోజుల లాక్ డౌన్ కు పిలుపు నిచ్చారు. దీనితో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ దేశ ప్రజలకు 21 రోజుల లాక్ డౌన్ కు పిలుపు నిచ్చారు. దీనితో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణకు చర్యలు చేపడుతున్నాయి. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నాయి. 

ఇక సినీ, క్రీడా ప్రముఖులు కూడా తమకు తోచిన విధంగా విరాళాలు ప్రకటిస్తూ, కరోనాపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. సెలెబ్రిటీ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ క్వారంటైన్  భాగంగా ఇంట్లోనే ఉంటూ అభిమానులకు  భారీన పడకుండా జాగ్రత్తలు చెబుతున్నారు. 

 

ఇక లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలో నెటిజన్లు వివిధ రకాల మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అందులో అనుష్క శర్మపై క్రియేట్ చేసిన ఓ మీమ్ వైరల్ అవుతోంది.క్వారంటైన్ తొలి రోజు ఉంటారు అంటూ సూపర్ స్టైలిష్ లుక్ లో అనుష్క శర్మ ఫోటో.. పక్కనే క్వారంటైన్ 21వ రోజు ఇలా ఉంటారు అంటూ అనుష్క డీ గ్లామర్ లుక్ లో సూయి ధాగా చిత్రంలో లుక్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ మీమ్ నెటిజన్లని ఆకట్టుకుంటోంది. 

శరత్ కఠారియా దర్శత్వంలో 2018లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అనుష్క శర్మ, కోహ్లీ 2017లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?