నిశ్శబ్దం ట్రైలర్: అనుష్కని భయపెడుతున్నదెవరు?

prashanth musti   | Asianet News
Published : Mar 06, 2020, 01:07 PM ISTUpdated : Mar 06, 2020, 01:08 PM IST
నిశ్శబ్దం ట్రైలర్: అనుష్కని భయపెడుతున్నదెవరు?

సారాంశం

బాక్సా ఆఫీస్ హీరోయిన్ అనుష్క శెట్టి మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కోన వెంకట్ ప్రొడక్షన్ లో హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో హారర్ అంశాలతో పాటు థ్రిల్లర్ సీన్స్ కూడా గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది.

టాలీవుడ్ బాక్సా ఆఫీస్ హీరోయిన్ అనుష్క శెట్టి మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కోన వెంకట్ ప్రొడక్షన్ లో హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో హారర్ అంశాలతో పాటు థ్రిల్లర్ సీన్స్ కూడా గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది.

ఇక అంజలి పోలీస్ ఆఫీసర్ గా సరికొత్తగా దర్శనమిచ్చింది. చూస్తుంటే అనుష్క పాత్రకు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్స్ టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు ట్రైలర్ కూడా క్లిక్కయ్యేలా కనిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ - హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను ఒకేసారి తెరకెక్కించారు.

సౌత్ లో ఎలాగూ అనుష్కకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి బాలీవుడ్ లో ప్రమోషన్ డోస్ కాస్త పెంచాలని చూస్తున్నారు. ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ ప్రాజెక్ట్ లో మాధవన్ అలాగే హాలీవుడ్ యాక్టర్ మైకేల్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?