ప్రముఖ నటి అపార్ట్మెంట్ మూసేసిన అధికారులు.. కారణం ఇదే!

Published : Apr 06, 2020, 10:10 AM IST
ప్రముఖ నటి అపార్ట్మెంట్ మూసేసిన అధికారులు.. కారణం ఇదే!

సారాంశం

కరోనా వైరస్ అగ్ర దేశాధి నేతలకు సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు కరోనా ప్రభావంతో వణికిపోతున్నాయి.

కరోనా వైరస్ అగ్ర దేశాధి నేతలకు సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు కరోనా ప్రభావంతో వణికిపోతున్నాయి. ఇండియాలో కూడా క్రమంగా కరోనా ప్రభావం పెరుగుతోంది. దీనితో సర్వత్రా ఆందోనళ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియాలో లాక్ డౌన్ కొనసాగుతోంది. 

ప్రజలు, సెలెబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. అన్ని రంగాలలో ఎక్కడి కార్యక్రమాలు అక్కడే ఆగిపోయాయి. ఒక్కరికి కరోనా వైరస్ సోకినా ఆ ప్రాంతం మొత్తం భయబ్రాంతులకు గురవుతోంది. బాలీవుడ్ ప్రముఖ నటి అంకిత లోఖండేపై కరోనా ప్రభావం పండింది. 

అంకిత లోఖండేకి చెందిన అపార్ట్మెంట్ ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ముంబైలోని మలాద్ ప్రాంతంలో అంకితకు ఓ అపార్ట్మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఇటీవల స్పెయిన్ నుంచి తిరిగి వచ్చాడు. ఎయిర్పోర్ట్ లో టెస్ట్ చేసినప్పుడు అతడికి కరోనా లక్షణాలు లేవు. 

అయినా కూడా అతడితో పాటు, అతడి భార్య కూడా 15 రోజులపాటు సెల్ఫ్ క్వారంటైన్ లో ఆ అపార్ట్మెంట్ లోనే ఉన్నారు. ఇటీవల అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. అతడి భార్యకు నెగిటివ్ వచ్చింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు అంకిత లోఖండే అపార్ట్మెంట్ ని తాత్కాలికంగా మూసివేశారు. 

అంకిత లోఖండే మణికర్ణిక, భాగీ 3 చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?