భార్యపై ట్రోలింగ్.. నా ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ అంటూ హీరో పోస్ట్

Published : Mar 17, 2020, 02:33 PM IST
భార్యపై ట్రోలింగ్.. నా ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ అంటూ హీరో పోస్ట్

సారాంశం

బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ, నటి నేహా ధూపియా 2018లో రహస్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వీరిద్దరి వివాహం జరిగింది.

బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ, నటి నేహా ధూపియా 2018లో రహస్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వీరిద్దరి వివాహం జరిగింది. ఇక అంగద్ బేడీ బాలీవుడ్ లో నటుడిగా కొనసాగుతున్నాడు.  నేహా ధూపియా మాత్రం టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. 

ఓ రియాలిటీ షోలో భాగంగా నేహా ధూపియా ఓ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన గర్ల్ ఫ్రెండ్ మరో ఐదుగురితో సంబధం పెట్టుకుందని అందుకే కొట్టానని అతడు వివరణఇచ్చాడు. అయినా కూడా ఆమెని కొట్టడం తప్పే అని నేహా ధూపియా తెలిపింది. దీనితో నేహా ధూపియా పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు.

దీనిపై నేహా ధూపియా వివరణ ఇచ్చింది.  తనెప్పుడూ మోసం చేసే వారికి అండగా నిలబడలేదని.. కేవలం శారీరక హింసని మాత్రమే వ్యతిరేకించారని పేర్కొంది. తానూ చెప్పిన విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని నేహా వివరణ ఇచ్చింది. 

అంగద్ బేడీ కూడా తన భార్యకు మద్దతుగా, ట్రోల్స్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. 'నా ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ వీళ్ళే అంటూ నేహా ధూపియాతో ఉన్న ఆ ఐదు పిక్స్ ని షేర్ చేశాడు. 

వీరిద్దరూ వివాహానికి ముందు కొంత కాలం సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. పెళ్లికి ముందే నేహా ధూపియా గర్భవతి అయింది. దీనితో కుటుంబ సభ్యులు వెంటనే వీరిద్దరికి వివాహం జరిపించారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?