లీక్ : అనసూయ అయితే పది లక్షలే.. అదేనా అసలు కారణం?

By telugu news teamFirst Published Feb 25, 2020, 11:09 AM IST
Highlights

ఈ సినిమాకోసం  టబుని సంప్రదిస్తే...తన రెమ్యునేషన్ గా కోటి రూపాయలు అడగటం షాక్ ఇచ్చిందిట. దానికి తోడు అలవైకుంఠపురములో ఆమె నటనటకు, గ్లామర్ కు రెస్పాన్స్ రాలేదు. 

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందబోయే  సినిమా సోమవారం ప్రారంభమైంది. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అంధాధున్’కు ఇది రీమేక్. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 6గా ఈ చిత్రాన్ని ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక హిందీలో కథలో కీలకంగా ఉన్న టబు పాత్రను తెలుగులో అనసూయను అనుకుంటున్నారు. మొదట ఆ పాత్రకు టబునే తీసుకుందామని దర్శక,నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. కానీ చివరి నిముషంలో అనసూయను సీన్ లోకి తెచ్చారట. అందుకు చెబ్బబడుతున్న కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అవేమిటంటే...

ఈ సినిమాకోసం  టబుని సంప్రదిస్తే...తన రెమ్యునేషన్ గా కోటి రూపాయలు అడగటం షాక్ ఇచ్చిందిట. దానికి తోడు అలవైకుంఠపురములో ఆమె నటనటకు, గ్లామర్ కు రెస్పాన్స్ రాలేదు. ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకుని టబుని తెలుగులో తీసుకోవటం వల్ల పెద్దగా కలిసొచ్చేది ఏమీ లేదని, అందుకు ఆల్టర్నేటివ్ గా అనసూయ కనిపించింది. అనసూయ అయితే పది లక్షల రెమ్యునేషన్ తో నడిచిపోతుందని లెక్కలు వేసారట. అయితే బాలీవుడ్ సినిమాకు టబు తెచ్చిన స్టార్ డమ్ ఏదైతే ఈ సినిమా కు  అనసూయ తేగలుగుతుందా అనేది ఆలోచించాల్సిన విషయం.

'భీష్మ' యూఎస్ కలెక్షన్స్ పరిస్దితి ఏంటి..?

మూడు కేటగిరీల్లో జాతీయ పురస్కారం అందుకున్న బాలీవుడ్‌ చిత్రం ‘అంధాధున్‌’.  ఆయుష్మాన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో చేయాలని హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రైట్స్ తీసుకున్నారు.  ఈ చిత్రం హీరో చూడగలిగి కూడా గుడ్డివాడుగా నటించాలి!  ఆ పాత్రను నితిన్ వేయబోతున్నారు. రీసెంట్ గా భీష్మతో హిట్ కొట్టిన నితిన్ ఈ పాత్రను చేయటానికి ఉత్సాహం గా ఉన్నారు.  

జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనే ఈ చిత్రానికి హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

సాంకేతిక బృందం:
సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంత్
సమర్పణ: బి. మధు (ఠాగూర్ మధు)
నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
మాటలు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్

click me!