శ్రీ ముఖి కొత్త యాంగిల్.. చూసి భరించండి!

Published : Nov 26, 2019, 01:17 PM ISTUpdated : Nov 26, 2019, 01:27 PM IST
శ్రీ ముఖి కొత్త యాంగిల్.. చూసి భరించండి!

సారాంశం

శ్రీ ముఖి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు నటిగా యాంకర్ గా డ్యాన్సర్ గా తన టాలెంట్ ని చూపించిన ఈ బ్యూటీ ఇప్పుడు సరికొత్తగా సింగర్ అవతారం ఎత్తింది. 

శ్రీ ముఖి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు నటిగా యాంకర్ గా డ్యాన్సర్ గా తన టాలెంట్ ని చూపించిన ఈ బ్యూటీ ఇప్పుడు సరికొత్తగా సింగర్ అవతారం ఎత్తింది. గతంలో ఎప్పుడు లేని విధంగా తన గాత్రాన్ని వినిపించిన ఈ బిగ్ బాస్ గడసరి ఓ వర్గం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది.

నాగార్జున హోస్ట్ గా నిర్వహించిన బిగ్ బాస్ 3 తెలుగు సీజన్ లో చురుగ్గా కనిపించి షోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచినా శ్రీ ముఖి చివరికి టైటిల్ గెలుచుకుంటుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా అభిమానుల అండతో రాహుల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. టైటిల్ దక్కకపోయినా షోలో పాల్గొన్నందుకు శ్రీ ముఖికి మంచి రెమ్యునరేషన్ దక్కినట్లు టాక్ వచ్చింది.

ఇకపోతే ఇప్పుడు స్టార్ మా 'స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్' అనే గేమ్ షోని బుల్లితెరపైకి తెస్తోంది. శ్రీ ముఖి అందులో యాంకర్ గా కనిపించి మళ్ళీ తన రెగ్యులర్ లైఫ్ తో బిజీ కానుంది. అయితే షో కోసం అమ్మడు ఒక స్పెషల్ సాంగ్ ని పాడింది. ఎదో ట్రై చేశాం.. విని భరించండి అంటూ తన గాత్రాన్ని వినిపించింది. ఇక ఎప్పటిలానే ఆమె పాడిన సాంగ్ పై పాజిటివ్ కామెంట్స్ తో పాటు భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం శ్రీ ముఖి పలు సినిమాలల్లో కూడా నటిస్తోంది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?