మీడియాని ఏకిపారేసిన యాంకర్ అనసూయ!

Published : Dec 22, 2019, 01:56 PM IST
మీడియాని ఏకిపారేసిన యాంకర్ అనసూయ!

సారాంశం

జీఎస్టీ సోదాలను ఖండిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తప్పుడు వార్తలు ప్రచురించిన మీడియాపై ఫైర్ అయ్యారు. నిజాలు తెలిసిన తరువాత అర్ధం చేసుకోవడం చాలా సులువైన పని, కానీ వాస్తవం కనుగొనడమే ఇక్కడ సమస్య అని పేర్కొన్నారు. 

రీసెంట్ గా కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖ యాంకర్లు సుమ, అనసూయ ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు చేపట్టారనే వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యాంకర్ సుమ ఈ వార్తలను ఖండించగా.. తాజాగా అనసూయ కూడా స్పందించారు.

జీఎస్టీ సోదాలను ఖండిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తప్పుడు వార్తలు ప్రచురించిన మీడియాపై ఫైర్ అయ్యారు. నిజాలు తెలిసిన తరువాత అర్ధం చేసుకోవడం చాలా సులువైన పని, కానీ వాస్తవం కనుగొనడమే ఇక్కడ సమస్య అని పేర్కొన్నారు.

టాలీవుడ్ ట్రెండ్ సెట్ చేయాలంటే ఈ హీరోలే..!

బంజారాహిల్స్ లోని తన ఇంటిపై కానీ, తనకు చెందిన స్థలాలపై ఎటువంటి సోదాలు జరగలేదని స్పష్టం చేశారు. మీడియా అనేది సమాచారమివ్వాలి కానీ ఊహాజనితమైన కథనాలు, వ్యక్తిగత అభిప్రాయాలను ఆస్కారం ఇవ్వకూడదని అన్నారు.

ఇండస్ట్రీలో కొనసాగడానికి, మంచి పేరు, గౌరవం తెచ్చుకోవడానికి తాము చాలా త్యాగాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. మీడియా చాలా పవర్ ఫుల్ అని పేర్కొన్న అనసూయ.. సమాజానికి మంచి చేయడంపై దృష్టి సారించాలని అన్నారు.

కష్టపడి పైకొచ్చిన వ్యక్తులను అనవసరంగా ఇబ్బందులకు గురిచేయకూడదని అన్నారు. ఏదైనా వార్తలు ప్రసారం చేసే ముందుకు అందులో నిజానిజాలు తెలుసుకోవాలని అన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?