అలా జరిగితే నేనె కరోనా వైరస్ ని నాశనం చేస్తా: అమితాబ్

prashanth musti   | Asianet News
Published : Mar 21, 2020, 01:15 PM IST
అలా జరిగితే నేనె కరోనా వైరస్ ని నాశనం చేస్తా: అమితాబ్

సారాంశం

కరోనా మహమ్మారి ఊహించని విధంగా హద్దులు దాటుతోంది. రెండే రోజుల వ్యవవధిలోనే వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే కరోనా ఏ రేంజ్ లో విజృంభిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం దేశమంతా కేంద్ర ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది.

కరోనా మహమ్మారి ఊహించని విధంగా హద్దులు దాటుతోంది. రెండే రోజుల వ్యవవధిలోనే వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే కరోనా ఏ రేంజ్ లో విజృంభిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం దేశమంతా కేంద్ర ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. అయితే ఈ సమయంలో సెలబ్రిటీలు కూడా సొంతంగా హౌజ్ అరెస్ట్ చేసుకుంటూ అభిమానులకు కూడా మంచి సందేశాలని అందిస్తున్నారు.

ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ కూడా కరోనా గురించి తన ఫాలోవర్స్ కి జాగ్రత్తలు చెబుతున్నారు. అదే విధంగా ఆయన ఒక పోస్ట్ లో కరోనా పై ఛలోక్తులు విసిరారు. తన కొడుకు అభిషేక్ బచ్చన్ చిన్నప్పటి బర్త్ డే పార్టీలో దిగిన ఒక ఫొటోను అమితాబ్ ట్వీట్ చేశారు. అందులో బిగ్ బి సూపర్ మ్యాన్ డ్రెస్ లో కనిపించారు. అయితే తనకు నిజమైన సూపర్ మ్యాన్ పవర్స్ ఉంటే గనక తప్పకుండా కరోనా వైరస్ ని నాశనం చేసేవాడినని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అదే విధంగా అభిమానులు తనని కలవాడిని రావొద్దని సందేశం ఇచ్చారు.   సాధారణంగా అమితాబ్ ప్రతి ఆదివారం ముంబైలోని జల్సా ప్యాలెస్ లో తన అభిమానులను కలుసుకుంటారు. అయితే కరోనా దృష్ట్యా అభిమానులు తన వద్దకు రవద్దను చెప్పారు. కొన్ని రోజుల పాటు మనకు మనమే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను నాశనం చేయవచ్చని అందరూ దృడంగా ఉండాలని ఆయన కోరారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?