అమితాబ్, అభిషేక్ బచ్చన్ లకు కరోనా, ఆసుపత్రికి తరలింపు

Siva Kodati |  
Published : Jul 11, 2020, 11:33 PM ISTUpdated : Jul 12, 2020, 08:14 AM IST
అమితాబ్, అభిషేక్ బచ్చన్ లకు కరోనా, ఆసుపత్రికి తరలింపు

సారాంశం

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌బీ అమితాబ్‌‌బచ్చన్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

భారతదేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తోన్న సంగతి తెలిసిందే. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం వైరస్ బాధితులుగా మారుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ, టీవీ నటులకు కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలింది. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌బీ అమితాబ్‌‌బచ్చన్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు తన తండ్రికి కరోనా సోకిందని, ఇద్దరమూ నానావతి ఆసుపత్రిలో చేరినట్టుగా అభిషేక్ బచ్చన్ తెలిపారు. కొద్దిపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఆయన ఒక ట్వీట్లో తెలిపారు. జయ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఇద్దరు నెగటివ్ గా తేలారు. 

‘‘ నాకు కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నానని బిగ్ బీ ట్వీట్ చేశారు. తన కుటుంబసభ్యులు, సిబ్బందికి టెస్టులు నిర్వహించారని, ఇందుకు సంబంధించిన ఫలితాలు రావాల్సి వుందని అమితాబ్ బచ్చన్ తెలిపారు. అలాగే తనను గత పది రోజులుగా కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా అమితాబ్ విజ్ఞప్తి  చేశారు. మరోవైపు ఆయనకు కరోనా వైరస్ సోకడంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?