గుడ్డి వాడినవుతానేమో అని భయమేసింది: అమితాబ్‌ బచ్చన్‌

By Satish ReddyFirst Published Apr 13, 2020, 10:38 AM IST
Highlights
అమితాబ్‌ బచ్చన్‌ తన కంటిచూపు మందిగిస్తుందన్న విషయాన్ని తన బ్లాక్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. `నాకు దృశ్యాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి . కొద్ది రోజులుగా పరిస్థితి ఇలాగే ఉంది. అంధత్వం రాబోతుందేమో అని నేను భావించాను. ఇప్పటికే నాకు ఉన్న వందలాది సమస్యలతో పాటు ఇది కూడా` అంటూ తన ఆరోగ్య పరిస్థితిపై పోస్ట్ చేశాడు.
బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలతో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో.. సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటాడు. తన సినిమాల విశేషాలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా ఎప్పటికప్పుడూ అభిమానులతో షేర్ చేసుకుంటుంటాడు. తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను కూడా బిగ్ బీ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవటం అమితాబ్ కు అలవాటు. అంతేకాదు ఎప్పటికప్పుడూ తన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అభిమానులకు అప్‌డేట్స్‌ ఇస్తుంటాడు బిగ్ బీ.

కొంత కాలం క్రితం తన ఆరోగ్యం బాగోలేదని, వైధ్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టుగా తన బ్లాగ్ ద్వారా వెల్లడించాడు అమితాబ్‌. అయితే బిగ్ బీ మాత్రం బ్రేక్ తీసుకోకుండా సినిమాలు చేసేందుకే ఇంట్రస్ట్ చూపించాడు.  ప్రస్తుతం అమితాబ్ చేతిలో మూడు భారీ చిత్రాలు ఉన్నాయి. తాజాగా అమితాబ్‌ తన ఆరోగ్య పరిస్థితిపై మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

ఆయన తన కంటిచూపు మందిగిస్తుందన్న విషయాన్ని తన బ్లాక్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. `నాకు దృశ్యాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి . కొద్ది రోజులుగా పరిస్థితి ఇలాగే ఉంది. అంధత్వం రాబోతుందేమో అని నేను భావించాను. ఇప్పటికే నాకు ఉన్న వందలాది సమస్యలతో పాటు ఇది కూడా` అంటూ తన ఆరోగ్య పరిస్థితిపై పోస్ట్ చేశాడు.

ఈ సమయంలో ఆయన తన చిన్నతన్నాన్ని గుర్తు చేసుకున్నాడు. ` నా చిన్నతనంలో నా కంటికి ఏదైనా ఇబ్బంది కలిగితే మా అమ్మ తేజీ బచ్చన్ తన  చీర కొంగును బాల్‌ లా చుట్టీ ఆవిరి పట్టి కంటి మీద పెట్టేది` అంటూ గుర్తు చేసుకున్నాడు. అదే సమయంలో డాక్టర్లు తన కంటి చూపుకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించినట్టుగా తెలిపాడు. ఎక్కువ సేపు కంప్యూటర్ చూడటం వల్ల కళ్లకు ఇబ్బంది కలిగిందని, కొద్ది పాటి జాగ్రత్తలతో అన్ని అధిగమించవచ్చిన డాక్టర్లు చెప్పినట్టుగా తెలిపాడు.
click me!