అభిమానుల 'బీడీ'ల గోల.. బన్నీ స్పెషల్ రిక్వెస్ట్!

prashanth musti   | Asianet News
Published : Feb 03, 2020, 10:37 AM IST
అభిమానుల 'బీడీ'ల గోల.. బన్నీ స్పెషల్ రిక్వెస్ట్!

సారాంశం

లా రోజుల తరువాత అసలైన బాక్స్ ఆఫీస్ రికార్డులతో ఇండస్ట్రీ వేడెక్కింది. అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమా ఊహించని విధంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. చిత్ర యూనిట్ ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అన్నట్లుగా ప్రచారాలు మొదలెట్టింది. 

టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత అసలైన బాక్స్ ఆఫీస్ రికార్డులతో ఇండస్ట్రీ వేడెక్కింది. అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమా ఊహించని విధంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. చిత్ర యూనిట్ ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అన్నట్లుగా ప్రచారాలు మొదలెట్టింది. అయితే సినిమాలో ప్రతి కంటెంట్ జనాలకు బాగా ఎక్కేసిందనే చెప్పాలి.

దాదాపు సగం ప్రమోషన్స్ వారితోనే జరిగిపోయింది. మెయిన్ గా సినిమా చివరలో 'సిత్తరాల సిరపడు' సాంగ్ ని చాలా మంది అనుకరించారు. అందులో బన్నీ చేసినట్లుగానే యాక్షన్ చేస్తూ.. స్టైల్ గా బీడీలతో కూడా స్టిల్స్ ఇచ్చారు. టిక్ టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో అభిమానుల బీడీలతో గోల చేయడం చిత్ర యూనిట్ ని కూడా తాకింది. విషయం తెలుసుకున్న బన్నీ వెంటనే ఫ్యాన్స్ కి ఒక చిన్న మెస్సేజ్ ఇచ్చాడు.

 

రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో సినిమా ఇంతగా సక్సెస్ కావడానికి ప్రధాన కారణం అభిమానులే అంటూ.. అయితే సినిమాలో బీడీ తాగుతూ కొంతమంది అలా అనుకరించడం కరెక్ట్ కాదని పొగ తాగుట ఆరోగ్యానికి హానికరమని చెప్పారు. అదే విధంగా తన పర్సనల్ లైఫ్ లో స్మోక్ చేయనని చెప్పిన బన్నీ సినిమాలో తనలా అలాంటివి చేయకూడదని వివరణ ఇచ్చాడు. ఇక 'అల.. వైకుంఠపురములో' ఇటీవల దేశవ్యాప్తంగా 200కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకున్న మొదటి తెలుగు(డైరెక్ట్) సినిమాగా నిలిచింది. చాల వరకు ద్విభాషా చిత్రాలే ఆ రికార్డును అందుకున్నాయి. త్రివిక్రమ్ - బన్నీ కేరీర్ లో కూడా బిగ్గెస్ట్ సినిమా 'అల..' నిలిచింది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?