స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ అల.. వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అల.. వైకుంఠపురములో చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బన్నీ, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబోలో తెరక్కుతున్న చిత్రం కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. బన్నీ సరసన రెండవసారి క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది.
సామజవరగమన అనే సాంగ్ తో ఇటీవలే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అత్యధిక లైక్స్ సాధించిన సాంగ్ గా ఆ పాట రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా అల వైకుంఠపురములో చిత్రం నుంచి రాములో రాములా అనే సాంగ్ టీజర్ ని రిలీజ్ చేశారు.
'రాములో రాములా నాన్నాగం చేసిందిరో.. నా ప్రాణం తీసిందిరో' అంటూ వినిపిస్తున్న లిరిక్ క్యాచీగా ఉంది. తమన్ మంచి బీట్ తో ఈ పార్టీ సాంగ్ ని కంపోజ్ చేసినట్లు ఉన్నాడు. వెండితెరపై ఈ సాంగ్ లో ఫ్యాన్స్ స్టెప్పులేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది కేవలం టీజర్ మాత్రమే కాబట్టి పూర్తి సాంగ్ ఇంకా హుషారెత్తించడం ఖాయం.
ఈ పాటలో బన్నీతో పాటు పూజా హెగ్డే, సుశాంత్ కూడా స్టెప్పులేస్తూ కనిపిస్తున్నారు. కాసర్ల శ్యామ్ ఈ పాటకు లిరిక్స్ అందించారు.