యూఎస్ లో మరో రికార్డ్ అందుకున్న బన్నీ

By Prashanth MFirst Published Feb 1, 2020, 8:19 PM IST
Highlights

అల.. వైకుంఠపురములో సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇండియాలో అత్యధిక వసూళ్లు అందుకున్న డైరెక్ట్ తెలుగు సినిమాగా నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన అల.. బన్నీ కెరీర్ లో మరచిపోలేని చిత్రంగా నిలిచింది. 

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల.. వైకుంఠపురములో సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇండియాలో అత్యధిక వసూళ్లు అందుకున్న డైరెక్ట్ తెలుగు సినిమాగా నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన అల.. బన్నీ కెరీర్ లో మరచిపోలేని చిత్రంగా నిలిచింది. అలాగే త్రివిక్రమ్ కూడా ఈ సినిమాతో మరోసారి తన అసలైన బలాన్ని చూపించాడు.

200కోట్లకు వసూళ్లతో మంచి ఉపుమీదున్న ఈ చిత్రం యూఎస్ లో కూడా డాలర్స్ ని రాబట్టడంలో అదరగొట్టేసింది. ఇప్పట్లో బన్నీ మోత తగ్గేలా కనిపించడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు - మరో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు ఉన్నప్పటికీ ఏ మాత్రం తడబడకుండా అల్లు అర్జున్ వరుస రికార్డులతో రెచ్చిపోతున్నాడు. ఈ నెల 13న వరల్డ్ వైడ్ గా తెలుగు మలయాళం భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఇక రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం 'అల.. వైకుంఠపురములో' యూఎస్ కలెక్షన్స్ $3.5మిలియన్ మార్క్ కి చేరుకున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే ఈ వీకెంట్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టి బన్నీ 4 మిలియన్స్ కి దగ్గరగా వెళతాడనిపిస్తోంది. ఇప్పటికే చాలా వరకు 'అల.. వైకుంఠపురములో'అన్ని ఏరియాల్లో ప్రాఫిట్ జోన్ లోకి వచ్చి లాభాలతో బయ్యర్స్ కి సంతోషాన్ని ఇస్తోంది.

సోషల్ మీడియాలో 'సరిలేరు నీకెవ్వరు - అల వైకుంఠపురములో' సినిమాలకు సంబందించిన కలెక్షన్స్ వార్ ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన కలెక్షన్స్ స్టాండర్డ్ గానే ఉన్నాయి. టాలీవుడ్ లో మునుపెన్నడు లేని విధంగా అల్లు అర్జున్ చాలా స్పీడ్ గా 200ల కోట్ల వసూళ్లను అందుకోవడమే కాకుండా కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు.

click me!