అల్లు అరవింద్ 1500 కోట్ల ప్రాజెక్ట్.. నో చెప్పిన రాంచరణ్, హృతిక్ రోషన్ ?

By tirumala ANFirst Published Dec 2, 2019, 3:19 PM IST
Highlights

సినిమాల విషయంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్లానింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాతగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఆయన ఒకరు.

సినిమాల విషయంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్లానింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాతగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఆయన ఒకరు. భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించినా, చిన్న సినిమాలు తెరకెక్కించినా గీతా ఆర్ట్స్ సంస్థ బ్రాండ్ పడితే హిట్ కావడం ఖాయం. 

బాలీవుడ్ లో సైతం గజినీ లాంటి చిత్రాన్ని నిర్మించిన అరవింద్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. ఇదిలా ఉండగా అల్లు అరవింద్ ఇటీవల ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్ లో రామాయణాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. 

ఈ పాన్ ఇండియా మూవీ ప్రకటన చిత్ర పరిశ్రమలో ఆసక్తి రేపింది. దంగల్ ఫేమ్ నితేశ్ తివారి దర్శత్వంలో రామాయణ గాధని మూడు భాగాలుగా చిత్రీకరించబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది ఆరంభం నుంచే షూటింగ్ కూడా ప్రారంభించాలని ప్లాన్ చేసుకున్నారు. 

కానీ ఈ చిత్రం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ చిత్రానికి నటీనటుల సమస్య తలెత్తుతోంది. మూడు భాగాల రామాయణం అంటే కనీసం రెండేళ్లకు పైగా ఇందులో నటించే హీరోలు తమ డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. ఈ చిత్రం కోసం హృతిక్ రోషన్ ని సంప్రదించగా అన్నేళ్ల పాటు తాను డేట్స్ కేటాయించలేనని తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది. 

కేవలం బాలీవుడ్ నటులని మాత్రమే కాదు రాంచరణ్ ని కూడా సంప్రదించారట. చరణ్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు నో చెప్పినట్లు టాక్. నటీనటుల సమస్య వల్ల తాత్కాలికంగా ఈ చిత్రం రద్దయినట్లు తెలుస్తోంది. దీనిని బట్టే అర్థం అవుతోంది.. భారీ బడ్జెట్ లో చిత్రాలు నిర్మించడం ఎంత కష్టమో. 

బాహుబలి రెండు భాగాల కోసం రాజమౌళి దాదాపు ఐదేళ్లు వర్క్ చేశారు. మలయాళంలో కూడా 1000 కోట్లతో మహాభారతం చిత్రానికి ప్రకటన వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కూడా రద్దైన సంగతి తెలిసిందే. రాజమౌళి కూడా తన కలల ప్రాజెక్ట్ మహాభారతం ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పేశారు. 

click me!