అల్లు వారింట 'సైరా' గ్రాండ్ పార్టీ!

Published : Oct 04, 2019, 10:17 AM ISTUpdated : Oct 04, 2019, 11:48 AM IST
అల్లు వారింట 'సైరా' గ్రాండ్ పార్టీ!

సారాంశం

మెగా క్యాంప్ అంతా ఇప్పుడు సైరా సక్సెస్ జోష్ మీద వుంది. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' ఇటీవల విడుదలై సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మెగాఫ్యామిలీ మొత్తం ఇప్పుడు 'సైరా' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. 'సైరా' యూనిట్ కోసం అల్లు ఫ్యామిలీ స్పెషల్ గా పార్టీ ఏర్పాటు చేసింది.

గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీ ఇండస్ట్రీలో మంచి సినిమాలు వస్తే యూనిట్ ని సత్కరించడం, పార్టీ ఇవ్వడం వంటివి చేస్తున్నారు. గతంలో 'మహానటి' అలానే మరికొన్ని సినిమాలకు అలానే చేశారు.

ఇప్పుడు తమ ఫ్యామిలీ నుండి వచ్చిన 'సైరా' సూపర్ సక్సెస్ కావడంతో అల్లు ఫ్యామిలీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. గురువారం రాత్రి అల్లు అరవింద్ ఇంట్లో 'సైరా' యూనిట్ తో విందు ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి ఇండస్ట్రీ నుండి చాలా మంది హాజరయ్యారు. 

అల్లు ఫ్యామిలీ ఇస్తోన్న పార్టీ కాబట్టి అల్లు అరవింద్, అల్లు అర్జున్ లు ఎలానూ ఉంటారు. వారితో పాటు మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్, అఖిల్, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్, రత్నవేలు, పరుచూరి బ్రదర్స్, సాయి మాధవ్ బుర్రా, దిల్ రాజు ఇలా చాలా మంది హాజరయ్యారు. అల్లు అరవింద్ స్వయంగా అందరినీ ఆహ్వానించారు. ఇంటి దగ్గర కూడా ఆయనే స్వయంగా అందరినీ పలకరించి, ఆహ్వానించడం విశేషం.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?