'ఎవరు' ఫస్ట్ డే కలెక్షన్స్.. అదరగొట్టిన అడివి శేష్

Published : Aug 16, 2019, 01:13 PM IST
'ఎవరు' ఫస్ట్ డే కలెక్షన్స్.. అదరగొట్టిన అడివి శేష్

సారాంశం

పంజా - బాహుబలి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ఇప్పుడు సరికొత్త కథానాయకుడిగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సొంతంగా కథలు రాసుకుంటూ తనకు సెట్టయ్యే కథలతో థ్రిల్ చేస్తున్నాడు. ఇక ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా విడుదల చేసిన ఎవరు సినిమా కూడా పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది.   

మొదటి రోజు ఈ సినిమా  తెలుగు రాష్ట్రాల్లో 1.7కోట్ల కలెక్షన్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. అడివి శేష్ కెరీర్ లోనే ఈ సినిమా హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ ని అందించింది. గతంలో వచ్చిన క్షణం - అమీతుమి - గూఢచారి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి లాభాల్ని అందించడంతో ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. సినిమా ప్రీ రిలీజ్ కూడా సాలిడ్ గానే జరుగగా ఇప్పుడు కలెక్షన్స్ కూడా పాజిటివ్ గా అందాయి. 

ఇదే ఫ్లోలో మొదటివారం కొనసాగితే ఎవరు సినిమాకు మంచి ప్రాఫిట్స్ అందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక విభిన్న పాత్రలో నటించిన రెజీనా కాసాండ్రాకి కూడా ఈ సినిమా ద్వారా మంచి విజయం దక్కింది. గత కొంత కాలంగా అమ్మడు వరుస అపజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. మరి ఎవరు సక్సెస్ బేబీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.    

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?