వైభవంగా సీనియర్ హీరోయిన్ స్నేహ సీమంతం!

Published : Oct 04, 2019, 04:53 PM IST
వైభవంగా సీనియర్ హీరోయిన్ స్నేహ సీమంతం!

సారాంశం

హీరోయిన్ గా సౌత్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది స్నేహ. తెలుగుతో పాటు తమిళం, మలయాళీ భాషల్లో స్నేహ పలు చిత్రాల్లో నటించింది. హోమ్లీ బ్యూటీగా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువైంది. 

సీనియర్ నటి స్నేహ తొలి వలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. స్నేహ కెరీర్ లో ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, వెంకీ, సంక్రాంతి లాంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. 

వివాహం తర్వాత స్నేహ వెండితెరపై జోరు తగ్గించింది. వివాహం తర్వాత స్నేహ తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయరామ లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసింది. 2012లో స్నేహ ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ కుమారుడు సంతానం. త్వరలో స్నేహ రెండోసారి తల్లి కాబోతోంది. 

కొన్నిరోజుల క్రితం స్నేహ తాను రెండోసారి తల్లి కాబోతున్న విషయాన్ని ఖరారు చేసింది. నేడు గర్భవతిగా ఉన్న స్నేహకు వైభవంగా సీమంతం జరిగింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?