90ల కాలంలో గ్యాప్ లేకుండా సినిమాల్లో నటించిన షకీలా అంటే తెలియని వారు ఉంటాడు. ఇక ఆమె జీవితంపై ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే మలయాళం ఇండస్ట్రీని షేక్ చేసిన షకీలా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు హీరోలపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేసింది.
సౌత్ ఇండియాలో సంచలనం సృష్టించిన అడల్ట్ యాక్టర్స్ లో షకీలా ఒకరు. 90ల కాలంలో గ్యాప్ లేకుండా సినిమాల్లో నటించిన షకీలా అంటే తెలియని వారు ఉంటాడు. ఇక ఆమె జీవితంపై ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే మలయాళం ఇండస్ట్రీని షేక్ చేసిన షకీలా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు హీరోలపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశారు.
undefined
ముఖ్యంగా అల్లు అర్జున్ ఎవరో కూడా తనకు తెలియదని చెప్పడం ఇంటర్నెట్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారింది. తన డ్యాన్సులతో బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ఆకర్షించిన స్టైలిష్ స్టార్ గురించి షకీలా ఆ విధంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మహేష్ బాబు తనకు బ్రదర్ లాంటి వాడని చెప్పిన షకీలా జూనియర్ ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్ అని తెలిపారు.
అయితే అల్లు అర్జున్ ప్రస్తావన రాగానే.. అతనెవరో తనకు తెలియదని షకీలా ఓపెన్ గా కామెంట్ చేశారు. ఆమె ఎన్నో మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంలో కూడా బన్నీకి హార్డ్ కొర్ ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో షకీలా ఆ విధంగా కామెంట్ చేయడం బన్నీ అభిమానులు సహించలేకపోతున్నారు. అయితే షకీలా తనకు తెలియని విషయాన్నీ తెలియదని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదని పలువురు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.