కరోనా వైరస్ ని కంట్రోల్ చేయొచ్చు.. అల్లు అర్జున్ హీరోయిన్!

By AN TeluguFirst Published Feb 1, 2020, 1:00 PM IST
Highlights

చైనా నుండి ఆస్ట్రేలియా, సింగపూర్, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో కరోనా వ్యాధి ప్రకంపనలను సృష్టిస్తోంది. ఇక ఇది ఇప్పటికే ఇండియాకు సోకిందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. 

కరోనా వైరస్ ని ఇలా నిరోధించవచ్చు అని చెబుతోంది నటి నివేదా పేతురాజ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. చైనా నుండి ఈ వ్యాధి అన్ని దేశాలకు వ్యాపిస్తుండడంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు.

చైనా నుండి ఆస్ట్రేలియా, సింగపూర్, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో కరోనా వ్యాధి ప్రకంపనలను సృష్టిస్తోంది. ఇక ఇది ఇప్పటికే ఇండియాకు సోకిందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. కేరళలో ఒక యువతి కరోనా వ్యాధి బారినపడినట్లు తెలుస్తోంది. దీంతో కరోనా వైరస్ ని అడ్డుకోవడానికి అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి.

దానికోసం ప్రత్యేక ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ వ్యాధికి వైద్యం లేదని చెబుతున్నారు. కానీ నటి నివేదా పేతురాజ్ కరోనా వ్యాధిని నిరోధించడానికి ఒక టిప్ చెబుతోంది. తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో నివేదా ఈ పోస్ట్ పెట్టింది.

అందులో పసుపు, తులసి, అల్లం కలిపినా కషాయాన్ని తాగుతున్న ఫోటోని పోస్ట్ చేసి ఫైట్ కరోనా అనే ట్యాగ్ జోడించింది. ఈ కషాయంతో కరోనా వ్యాధిని నిరోధించవచ్చునని నివేదా పేర్కొంది. మరి ఈ నాటు వైద్యం నిజంగానే వర్కవుట్ అవుతుందా అనేదే ప్రశ్న. 

click me!