కాలుకు దెబ్బ, సర్జరీ.. నడవలేని స్దితిలో చైతు హీరోయిన్

Published : Oct 20, 2019, 10:14 AM ISTUpdated : Oct 20, 2019, 10:18 AM IST
కాలుకు దెబ్బ, సర్జరీ.. నడవలేని స్దితిలో చైతు హీరోయిన్

సారాంశం

నాగచైతన్య సరసన చేసిన  ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన హీరోయిన్ మాంజిమా మోహన్‌. ఆ తర్వాత ఆమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు.

నాగచైతన్య సరసన చేసిన  ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన హీరోయిన్ మాంజిమా మోహన్‌. ఆ తర్వాత ఆమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే ఈ మధ్యన కొందరు నిర్మాతలు ఆమెను ఎప్రోచ్ అయ్యారు. ఈ నేపధ్యంలో ఆమె సినిమాలు చేసే స్దితిలో లేరని తెలిసింది. ఈ విషయమై ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి అందరికీ తెలియచేసారు.

తాను గాయపడ్డానని, కాలికి ఈ మధ్యనే సర్జరీ జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని ఆమె ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫొటోలను కూడా షేర్‌ చేశారు.

ఆ పోస్ట్ సారాంసం ఇదీ... ‘కొన్ని వారాల క్రితం నా జీవితంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో చిన్న సర్జరీ చేయాల్సి వచ్చింది. మరో నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ‘మీ జీవితంలో ఎదుర్కొన్న అతి కష్టమైన ఘటన ఏది?’ అని ఒకప్పుడు చాలాసార్లు నన్ను కొందరు అడిగారు. ‘ఇప్పటి వరకు అలాంటివి ఏమీ జరగలేదు’ అని వారికి చెప్పాను. కానీ, ఇప్పుడు జీవితంలో దానికి విభిన్నమైన సమాధానం దొరికింది. గాయపడ్డ తర్వాత కొన్ని రోజులపాటు చాలా బాధపడ్డా.

చివరికి ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు నా కాళ్లపై నేను నిలబడగలుగుతున్నా. నాకు ఇష్టమైన నటనకు తాత్కాలికంగా దూరంగా ఉన్నాను. గాయపడ్డ తర్వాత వచ్చిన మీ ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లకు స్పందించనందుకు క్షమించండి. ఈ అవకాశాన్ని (రెస్ట్ ) నేను బాగా ఉపయోగించుకున్నా. నాలోని నన్ను తెలుసుకున్నా. ఈ బ్రేక్‌ నాకు చాలా అవసరమని అర్థం చేసుకున్నా. నేను ఇలా మాట్లాడటం కాస్త విచిత్రంగానే అనిపించొచ్చు. ఈ సంఘటన, పరిస్థితులు నన్ను చాలా మార్చాయి. ఇంకా బలమైన వ్యక్తిని చేశాయి. ‘కారణం లేకుండా ఏదీ జరగదు’ అనడం వాస్తవమే’ అని పోస్ట్‌ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?