అది నాకు అస్సలు నచ్చదు, ముట్టుకుంటే బ్లాస్టైపోతారు.. లావణ్య

By telugu news teamFirst Published Jun 4, 2020, 7:23 AM IST
Highlights

ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. 

తనని ముట్టుకుంటే బ్లాస్టైపోతారని అందాల నటి లావణ్య త్రిపాఠి అంటున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లకు బ్రేకులు పడ్డాయి. ఈ ఖాళీ సమయంలో లావణ్య.. అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ లో ముచ్చటిస్తూ గడిపేస్తున్నారు. తాజాగా ఆమె మరోసారి అభిమానులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ‘ఎలాంటి విషయాల్లో ఎదుటివారిపై చిరాకు, కోపం వస్తుంది?’ అనే ప్రశ్నకు సమాధానంగా.. ‘ఎవరైనా చెప్పిన సమయానికి కాకుండా ఆలస్యంగా వస్తే నాకు నచ్చదు. ఎందుకంటే నాకు సహనం చాలా తక్కువ’ అని అన్నారు.

‘ఒక వేళ మీకు మీరే ఒక వార్నింగ్ లేబుల్ ఇచ్చుకోవాల్సి వస్తే.. ఏమని పిలుస్తారు..?’ అని మరో అభిమాని ప్రశ్నించగా.. ‘ ముట్టుకుంటే బ్లాస్ట్ అయిపోతారు’ అనే లేబుల్ ఇచ్చుకుంటానని సమాధానం ఇచ్చింది.  అంతేకాకుండా ప్రతిరోజూ వర్కౌట్స్ చేయకుంటే తన మనసుకు నచ్చదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. 

కాగా... లావణ్య అర్జున్ సురవరం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా క్రీడా నేపథ్యంలో సాగనుంది. దీంతో పాటు కార్తికేయకు జోడీగా ‘చావు కబురు చల్లగా’ చిత్రంలోనూ నటిస్తున్నారు. 

click me!