
గోవా భామ ఇలియానా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరన్న విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Jagannadh) పోకిరి చిత్రంతో ఈ గోవా అందాన్ని తెలుగు ఆడియెన్స్ కు పరిచయం చేశాడు. ఈ ఒక్క సినిమాతో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఆ ఊపుతోనే సౌత్ లో యువతకు కలల రాణిగా మారింది. జీరో సైజు నడుముతో ఇలియానా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతాఇంతా కాదు. ఇప్పటికీ ఎవరైనా సన్నగా కనిపిస్తే ఇలియానాతో పోల్చడం మనం చూస్తూనే ఉంటాం.
అయితే, ఇటు కేరీర్ తో పాటు.. అటు ఆరోగ్యం పట్ల ఇలియానా చాలా శ్రద్ధ వహిస్తుంది. కనీస ఎక్సర్ సైజులు చేస్తూ స్లిమ్ ఫిట్ బాడీని మెయిన్ టెయిన్ చేస్తూ ఉంటుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ బికినీల్లో దర్శనమిచ్చి దుమారం రేపుతూ ఉంటోంది. స్కిన్ షోలో ఇలియాను ఎవరూ బీట్ చేయలేరు అన్నంతలా ఎక్స్ పోజ్ లు కూడా చేసింది. అయితే తాజాగా ఈ సుందరి పోస్ట్ చేసిన వీడియో క్లిప్ అభిమానులు, నెటిజన్లను ఖంగారు పడేలా చేస్తోంది. రెండు కను గుడ్లు దగ్గరికి ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలియాను ఆరోగ్యం ఏమైనా దెబ్బతిందా అనే ఉద్దేశంతో ‘ఏమైంది ఇలియా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
వాస్తవానికి, ఇలియానా ఆరోగ్యానికి ఏమీ కాలేదు. కంగారు పడాల్సిన పనేమీ లేదు. తను పోస్ట్ వీడియోలో.. తన ఐ బాల్స్ ను దగ్గరికి చేసేందుకు ప్రయత్నించింది. ఈ పరిస్థితికి కారణమేంటో కూడా క్యాప్షన్ లో తెలియజేసింది. ‘నా మెదడు కాఫీ లేకుండా పనిచేయడానికి ప్రయత్నిస్తోంది’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇన్ డైరెక్ట్ గా తనకు కాఫీపై ఉన్న ప్రేమను తెలియజేసింది. కాఫీ లేకుంటే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వీడియో క్లిప్ ద్వారా వివరించిందంతే.
ఇక కేరీర్ విషయానికొస్తే.. తెలుగులో చివరిగా మాస్ మహారాజ రవితేజ (Ravi Teja)తో కలిసి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో నటించింది. ఈ మూవీలో ఇలియానా కాస్తా బొద్దుగా కనిపించడంతో న్యూ లుక్ ను కూడా ఆడియెన్స్ ఎంజాయి చేశారు. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ‘పగల్ పంథి, ది బిగ్ బుల్, అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.