నా విడాకులకు కారణం ఆ హీరో కాదు : అమలాపాల్

Published : Feb 18, 2020, 02:07 PM IST
నా విడాకులకు కారణం ఆ హీరో కాదు : అమలాపాల్

సారాంశం

అమలాపాల్ కూడా ప్రేమలో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దర్శకుడు విజయ్ తండ్రి ఏఎల్.అలగప్పన్.. అమలాపాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమలాపాల్.. విజయ్ నుంచి విడిపోవడానికి, విడాకులు పొందడానికి నటుడు ధనుషే కారణమని పేర్కొన్నారు. 

తన విడాకులపై వచ్చిన వార్తలపై ఘాటుగా స్పందించి మరోసారి వార్తల్లో నిలిచింది నటి అమలాపాల్.  కొన్నేళ్లక్రితం అమలాపాల్.. దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జంట మధ్య మనస్పర్ధలు రావడంతో రెండేళ్లకే విడాకులు తీసుకుంది.

ఆ తరువాత నటిగా తన కెరీర్ ని కొనసాగిస్తోంది. ఇటీవల విజయ్ రెండో పెళ్లి చేసుకున్నారు. అమలాపాల్ కూడా ప్రేమలో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దర్శకుడు విజయ్ తండ్రి ఏఎల్.అలగప్పన్.. అమలాపాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

రెడ్ డ్రెస్ లో 'RX100' పిల్ల.. చూపు తిప్పుకోలేరు!

అమలాపాల్.. విజయ్ నుంచి విడిపోవడానికి, విడాకులు పొందడానికి నటుడు ధనుషే కారణమని పేర్కొన్నారు. తాను నిర్మించిన 'అమ్మ కనక్కు' చిత్రంలో నటించమని ధనుష్.. అమలాపాల్ ని కోరాడని తెలిపారు. అయితే పెళ్లికి ముందు ఇకపై నటించనని చెప్పిన అమలాపాల్ మళ్లీ నటించడానికి సిద్ధమైందని.. అదే విజయ్ కి, ఆమెకి మధ్య విడాకులకు దారి తీసిందని చెప్పారు.

విజయ్ తండ్రి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై అమలాపాల్ స్పందించింది. వివాహ రద్దు గురించి చర్చ అనవసరమని చెప్పింది. అది తన వ్యక్తిగత విషయమని తెలిపింది. విడాకులు తీసుకోవాలన్నది పూర్తిగా తన సొంత నిర్ణయమని.. అందుకు వేరెవరూ బాధ్యులు కాదని చెప్పుకొచ్చింది.

నటుడు ధనుష్ తాను బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో ఒకరని.. ఈ విషయంపై తనను ఇంకేం అడగొద్దని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'అదో అందపరవై పోల' అనే సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?