తమన్నా టార్చర్ తట్టుకోలేకపోతున్నా.. శ్రీరెడ్డి!

Published : Dec 31, 2019, 05:25 PM ISTUpdated : Dec 31, 2019, 05:27 PM IST
తమన్నా టార్చర్ తట్టుకోలేకపోతున్నా.. శ్రీరెడ్డి!

సారాంశం

శ్రీరెడ్డి ప్రస్తుతం ఉంటున్న ఇంటి దగ్గర ఓ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతుందట. ఈ సిరీస్ లో తమన్నా నటిస్తున్నారు. అయితే షూటింగ్ కి వచ్చే వారంతా కూడా తమ వాహనాలను శ్రీరెడ్డి ఇంటి ముందు పార్క్ చేస్తున్నారట. 

నటి శ్రీరెడ్డి చెన్నైకి మకాం షిఫ్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రజల కోసం సాయం చేయాలనుకుంటున్నానని.. అక్కడి టాలెంటెడ్ నటీనటుల కోసం నిర్మాతగా మారతానని గతంలో చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు అక్కడి ప్రజలు తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకొచ్చింది.

శ్రీరెడ్డి ప్రస్తుతం ఉంటున్న ఇంటి దగ్గర ఓ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతుందట. ఈ సిరీస్ లో తమన్నా నటిస్తున్నారు. అయితే షూటింగ్ కి వచ్చే వారంతా కూడా తమ వాహనాలను శ్రీరెడ్డి ఇంటి ముందు పార్క్ చేస్తున్నారట. కొంతమంది తన ఇంటి ముందు కూర్చుంటున్నారట. దాంతో విసిగిపోయిన శ్రీరెడ్డి ఎన్నో సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బన్నీ ఓవర్ కాన్ఫిడెన్స్.. మహేష్ కంటే ముందుగానే..?

కానీ వారు పట్టించుకోవడం లేదట. ఏం చేయాలో తెలియక..లైవ్ వీడియోను పోస్ట్ చేస్తూ తన బాధని చెప్పుకొచ్చింది. తన ఇంటి ముందు ఉన్నవారంతా కూడా తనపై కామెంట్స్ చేస్తున్నారని.. తమన్నా సెక్యురిటీ గార్డ్స్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పింది. తమన్నా షూటింగ్ జరిగితే ఏంటని ప్రశ్నించింది.

గత పదిహేను రోజులుగా షూటింగ్ కి వచ్చినవారంతా తనను టార్చర్ పెడుతున్నారని.. రోజూ ఇంటి ముందు ఉన్న రోడ్ ని బ్లాక్ చేస్తున్నారని మండిపడింది. పోలీసులు కూడా వాళ్లతో కలిసి తనను పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చింది.

ఇంటి ముందే అందరూ ఉంటే సొంత పనులు ఎలా చేసుకుంటానని ప్రశ్నించింది. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని టార్చర్ పెడుతున్నారని.. తనతో పాటు చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?