ముంబైలో మరో నటుడి ఆత్మహత్య: హత్య చేశారని ఫ్యామిలీ ఆరోపణ

Published : Sep 29, 2020, 06:18 PM IST
ముంబైలో మరో నటుడి ఆత్మహత్య: హత్య చేశారని ఫ్యామిలీ ఆరోపణ

సారాంశం

ముంబైలో మరో సినీ నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అక్షత్ ఉత్కర్ష్ అనే వర్ధమాన నటుడు తన ఇంటిలో శవమై కనిపించాడు, సుశాంత్ రాజ్ పుత్ మాదిరే అతను కూడా బీహారుకు చెందినవాడే.

న్యూఢిల్లీ: వర్ధమాన నటుడు అక్షత్ ఉత్కర్ష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని అంధేరిలో గల తన ఇంటిలో అతను మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత అక్షత్ మృతదేహాన్ని కుటుంబ సభ్యుకు అప్పగించారు. 

ఆదివారం రాత్రి అతను మరణించాడు. తగిన అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్ కు గురై అతను ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అతను బీహార్ లోని ముజఫర్ పూర్ కు చెందినవాడు. అయితే, అది ఆత్మహత్య కాదని, హత్య చేశారని, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అక్షత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

అతను మరణించినట్లు ఆదివారం రాత్రి 11.30 గంటలకు అతని రూమ్మేట్ గుర్తించాడు. ఈ సంఘటన పట్ల నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనను ప్రస్తావిస్తూ కొంత మంది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యను గుర్తు చేస్తున్నారు. 

జూన్ 14వ తేదీన ముంబైలో మరణించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా బీహారుకు చెందినవాడే కావడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?