777 Charlie:ఈ కుక్క సినిమా కలెక్షన్స్ తెలిస్తే మతి పోతుంది

Published : Jul 11, 2022, 10:12 AM IST
777 Charlie:ఈ కుక్క సినిమా కలెక్షన్స్ తెలిస్తే మతి పోతుంది

సారాంశం

రక్షిత్‌ శెట్టి లీడ్‌ రోల్‌లో నటించిన ‘777 ఛార్లీ’ సినిమా చూశారు. మనిషికి, పెంపుడు కుక్క మధ్య ఉన్న బాండింగ్‌ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు కిరణ్‌రాజ్‌.   ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 10న విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. భారీ వసూళ్లను రాబడుతుంది. ధర్మ(రక్షిత్ శెట్టి), చార్లి అనే కుక్కకు మధ్య గల అనుబంధాన్ని ఈ చిత్రంలో హృద్యంగా ఆవిష్కరించారు.    

కన్నడ యంగ్‌ హీరో రక్షిత్‌ శెట్టి తాజాగా నటించిన చిత్రం '777 చార్లి'. పెట్‌ డాగ్ నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ పాన్‌ ఇండియాగా తెరకెక్కించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 10న విడుదలైంది. కె. కిరణ్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌తో దూసుకుపోతూ భారీ వసూళ్లను రాబట్టింది. ఒక వ్యక్తికి, చార్లి అనే కుక్కకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ చిత్రంలో హృద్యంగా చూపించారు. ఇటీవల ఈ సినిమా చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెక్కి వెక్కి ఏడ్చిన విషయం తెలిసిందే.  ఈ చిత్రం భాక్సాఫీస్ దగ్గర ఓ రేంజిలో కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం కర్ణాటకలో ముప్పై రోజులుకు గానూ 75 కోట్లు వసూలు చేసింది. తెలుగు వెర్షన్ 4 కోట్లు కలెక్ట్ చేయగా, తమిళ వెర్షన్ కూడా 4 కోట్లు వసూలు చేసింద. మళయాళ వెర్షన్ 5 కోట్లు తెచ్చి పెట్టింది. ఓవర్ సీస్ లో 5.5 కోట్ల వసూలు చేసింది. మొత్తం మిగతా వన్నీ కలిపితే 100 కోట్లు వసూలు చేసి మ్యాజిక్ చేసింది. 
                                                        
ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం వైరల్‌ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ గెలుచుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇంకా డిజిటల్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించని ఈ మూవీ ఆగస్టు రెండో వారం నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని సమాచారం.   ఇకపోతే రక్షిత్‌ శెట్టి కన్నడ సినిమా 'కిరిక్‌ పార్టీ'తో తెరంగేట్రం చేశాడు. 

‘అతడే శ్రీమన్నారాయణ’  సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ర‌క్షిత్ శెట్టి (Rakshit Shetty). అతడు హీరోగా నటించిన చిత్రం ‘777 చార్లి’ (777 Charlie). ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ జూన్ 10న  తెలుగు, క‌న్నడ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుదల అయింది. హీరోకు, కుక్కకు మధ్య గల అనుబంధాన్ని ఈ సినిమాలో హృద్యంగా చూపించారు. 

 ‘777 చార్లి’ సినిమాతోనే కిరణ్ రాజ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం తన కలల ప్రాజెక్టు అని చెప్పాడు. ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను అతడు అభిమానులతో గతంలో పంచుకున్నాడు. ‘‘సినిమా కోసం లాబ్రాడర్ కుక్కలను ఎంపిక చేశాం. ఆ కుక్కలు భావాలను అద్భుతంగా పలికించగలవు. చిత్రంలోని పప్పీకీ రెండు నుంచి రెండున్నరేళ్లు శిక్షణ ఇచ్చాం. కుక్క రక్షిత్‌ను కౌగిలించుకునే సీన్ కోసమే ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చాం. సినిమా స్క్రిఫ్ట్‌ను యేడాదిన్నర పాటు రాశాను. కుక్కల మీద పరిశోధన కూడా చేశాను’’ అని కిరణ్ రాజ్ తెలిపాడు.

‘777 చార్లి’ (777 Charlie) లో నాలుగు కుక్కలు నటించాయి. అందులోని ఒక దాని పేరే ‘సింబా’. ఈ కుక్క మే 11న మరణించింది. కానీ, ‘777 చార్లి’ (777 Charlie) ఈ మధ్యనే విడుదలకావడంతో ‘సింబా’ గురించి అందరు ఆరా తీయడం మొదలుపెట్టారు. బెంగళూరులోని బసవనగుడికి చెందిన వరుణ్ ఈ ‘సింబా’ను పెంచుతున్నారు. అంజలి మీనన్ (Anjali Menon) దర్శకత్వం వహించిన బెంగళూరు డేస్ (Bangalore Days) లో ఈ కుక్కు మొదటిసారిగా నటించింది. ఈ చిత్రంలో నిత్యా మీనన్ పెంపుడు జంతువుగా కనిపించింది. అనంతరం అనేక సినిమాలు చేసింది. ‘శివాజీ సూరత్‌కల్‌’, ‘నాను మత్తు గుండా’, ‘గుల్టూ’, ‘వాజిద్‌’ వంటి తదితర సినిమాల్లో నటించింది. అనేక డాగ్ షోలు, యాడ్‌లు కూడా చేసింది.
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?