శ్రీదేవి ముందు నిలబడాలంటే నాకు మాసిన గడ్డమే కరెక్ట్ : చిరంజీవి

By tirumala ANFirst Published May 6, 2020, 9:55 AM IST
Highlights

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్స్ లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రం ఒకటి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అద్భుత దృశ్యకావ్యం తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్స్ లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రం ఒకటి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అద్భుత దృశ్యకావ్యం తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 1990 మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం విడుదలయింది. మెగాస్టార్ చిరంజీవి.. నిజమైన అతిలోక సుందరి శ్రీదేవి ఈ చిత్రంలో జంటగా నటించారు. 

మే 9కి ఈ చిత్రం విడుదలై 30 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ సందర్భంగా వైజయంతి మూవీస్ సంస్థ జగదేక వీరుడు అతిలోక సుందరి 30 ఇయర్స్ సెలెబ్రేషన్స్ ని విభిన్నంగా ప్లాన్ చేసింది. ఈ చిత్ర విశేషాలని ఒక్కొక్కటిగా వివరిస్తూ నేచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ తో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా తొలి వీడియోన రిలీజ్ చేశారు. 

ఈ వీడియోలో అసలు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర ఆలోచన ఎలా వచ్చిందో వివరించారు. ఎన్టీఆర్ నటించిన జగదేకవీరుని కథ తరహాలో చిరంజీవితో ఫాంటసీ చిత్రం చేయాలనేది అశ్విని దత్ కోరిక. అలాంటి చిత్రం రాఘవేంద్ర రావు గారికే సాధ్యం అని.. రాఘవేంద్ర రావుని, రచయిత శ్రీనివాస్ చక్రవర్తిని తిరుమలకు పంపారు. 

తిరుమలలో ఉండగా శ్రీనివాస్ చక్రవర్తికి ఒక ఆలోచన వచ్చింది. దేవలోకం నుంచి వచ్చిన దేవకన్య ఉంగరం పోతుంది. ఆ ఉంగరం చిరంజీవికి దొరుకుతుంది. ఆసక్తికరంగా ఉన్న ఈ పాయింట్ రాఘవేంద్ర రావు,  అశ్విని దత్ లకు బాగా నచ్చేసింది. 

దేవకన్యలా కనిపించగలిగే నటి ఎవరు అని ఆలోచిస్తుండగా శ్రీదేవిని అనుకున్నారు. అంతే.. క్రేజీ కాంబో సెట్ కావడంతో అంతటి బలమైన కథ సిద్ధం చేసే పనిలో వైజయంతి సంస్థ నిమగ్నమైంది. తమ ఆఫీస్ లోనే రాఘవేంద్ర రావు, యండమూరి వీరేంద్రనాథ్, జంధ్యాల, విజయేంద్ర ప్రసాద్ ఇలా దిగ్గజ రచయితలంతా ఒక్కచోటికి చేరారు. 

చిరంజీవి గారు కూడా కథా చర్చల్లో పాల్గొన్నారు. శ్రీదేవి దేవకన్య అయినప్పుడు.. తనకు వేరే గెటప్పులు అవసరం లేదని.. మాసిన గడంతో సామాన్య మానవుడిలా కనిపిస్తే బావుంటుందని చెప్పారు. ఆ విధంగా అద్భుత దృశ్య కావ్య చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి జర్నీ మొదలైనట్లు నాని తన వాయిస్ ఓవర్ తో వివరించాడు. 

 

click me!