2019: ఆ మార్కెట్ లో 'మహర్షి' పెద్ద ప్లాఫ్...'ఎఫ్ 2' బ్లాక్ బస్టర్

prashanth musti   | Asianet News
Published : Dec 22, 2019, 07:33 AM IST
2019: ఆ మార్కెట్ లో 'మహర్షి' పెద్ద ప్లాఫ్...'ఎఫ్ 2' బ్లాక్ బస్టర్

సారాంశం

తెలుగు పరిశ్రమ లాభ, నష్టాలు బేరేజు వేసుకుంటోంది. సినిమా రంగానికి ఆదాయ మార్గంగా ఉంటూ వస్తోన్న శాటిలైట్ మార్కెట్ లో ఏ సినిమాలు సక్సెస్ అయ్యాయి...ఏవి డిజాస్టర్ అయ్యాయి  కూడా పరిశీలిస్తోంది. థియోటర్ బిజినెస్ ప్రకారం చూస్తే ఈ సంవత్సరంలో భారీ ఫ్లాఫ్ లు, లో బడ్జెట్  హిట్ లు వచ్చి ఆశ్చర్యపరిచాయి.

2019 మరికొద్ది రోజుల్లో వెళ్లిపోతోంది. దాంతో తెలుగు పరిశ్రమ లాభ, నష్టాలు బేరేజు వేసుకుంటోంది. సినిమా రంగానికి ఆదాయ మార్గంగా ఉంటూ వస్తోన్న శాటిలైట్ మార్కెట్ లో ఏ సినిమాలు సక్సెస్ అయ్యాయి...ఏవి డిజాస్టర్ అయ్యాయి  కూడా పరిశీలిస్తోంది. థియోటర్ బిజినెస్ ప్రకారం చూస్తే ఈ సంవత్సరంలో భారీ ఫ్లాఫ్ లు, లో బడ్జెట్  హిట్ లు వచ్చి ఆశ్చర్యపరిచాయి.

టీవీల్లోనూ అదే పరిస్దితి కనపడింది. టీఆర్పీలు పెద్ద సినిమాలకు షాక్ ఇస్తే ..కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలను అక్కున చేర్చుకున్నాయి.  ఈ సంవత్సరం ప్రారంభంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 చిత్రం టీవీ లోనూ అదే విధంగా సక్సెస్ అయ్యింది. టీఆర్పీ 17.23  తెచ్చుకుని అవుట్ స్టాండింగ్ గా నిలిచింది. ఆ తర్వాత ప్లేస్ లో ఇస్మార్ట్ శంకర్ ఉంది.

రామ్, పూరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాని టీవీల్లోనూ బాగా చూసారు. 16.63 టీఆర్పీ రేటు వచ్చింది. ఇక మూడవ ప్లేస్ లో రాఘవ లారెన్స్ నటించిన కాంచన 3 చిత్రం ఉంది.  13.10 టీఆర్పీ తెచ్చుకుని ఈ సినిమా దుమ్ము రేపింది. కాంచన 3 కు ఆ స్దాయి ఆదరణ టీవీల్లో లభిస్తుందని ఎవరూ ఊహించలేదు.  ఇక  షాకింగ్ గా మహేష్ బాబు బ్లాక్ బస్టర్ చిత్రం మహర్షి ..పై వాటితో పోలిస్తే టీఆర్పీలలో బాగా వెనకబడింది. 9.2 టీఆర్పీ తెచ్చుకుంది. ఓ రకంగా టీవీల్లో ప్లాఫ్ అని చెప్పాలి.

మిగతా సూపర్ హిట్ సినిమాల టీఆర్పీలు ఈ క్రింద విధంగా ఉన్నాయి.

ఓహ్ బేబి (9)  

జెర్సీ (8.8)  

మజిలి(7.9)  

వినయ విధేయ రామ (7.9)  

సీత (7.53)  

కళ్యాణ్ రామ్ 118 (6.33)

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?