
అక్కినేని నాగచైతన్య, రాశి ఖన్నా జంటగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాంక్యూ’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మార్నింగ్ షోకే ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చేసింది. నాగచైతన్య కెరీర్ లో అతి తక్కువ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా థాంక్యూ నిలిచింది తన ఎదుగుదలకు కారణమైన వారికి కృతజ్ఞత చెబుతూ ఓ యువకుడు సాగించి జర్నీ కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల లో విడుదలైన భారీ చిత్రాల్లో థాంక్యూ ఒకటి కావడంతో నాగచైతన్య సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే దారుణమైన నిరాశ మిగిల్చింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఎపిక్ డిజాస్టర్ రిజల్ట్ పొందింది. ఈ సినిమా జీరో షేర్ వరల్డ్ వైడ్ అని తేల్చారు. కలెక్షన్స్ తో వచ్చిన కొద్దో గొప్పో మొత్తం రెంటల్ బేసిస్ మీద లెక్కేస్తే షేర్ ఏమీ మిగలదు అని ట్రేడ్ అంటోంది. అంత దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. మిడ్ రేంజ్ హీరోల కంటే థాంక్యూ సినిమాకు తక్కువ వసూళ్లు రావడం దర్శకనిర్మాతలకు , అభిమానులకు షాక్ కు గురిచేస్తోంది. ఈ సినిమా 24 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. మౌత్ టాక్ నెగెటివ్ గా ఉండటంతో థాంక్యూ సినిమా బ్రేక్ ఈవెన్ అవడం అసాధ్యం అంటున్నారు.
ఫస్ట్ డే నే కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అవ్వగా రెండో రోజు మరింత స్లో అయిన సినిమా ఆల్ మోస్ట్ 60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచింది. సినిమా మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేదు. ఆల్ మోస్ట్ 20% రేంజ్ లో డ్రాప్ తో చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ పడ్డాయి సినిమాకి.
ఇక నాగ చైతన్య నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని అందుకుని లాంగ్ రన్ లో ఒకటి తర్వాత ఒకటి వరుస పెట్టి సక్సెస్ లుగా నిలిచాయి. కానీ ఆ ఇంపాక్ట్ ఏమి కూడా థాంక్యూ సినిమా మీద పడలేదు… సినిమాకి అనుకున్న రేంజ్ లో బజ్ ఏర్పడలేదు. దానికి తోడూ రిలీజ్ రోజు వర్షాల ఇంపాక్ట్ కూడా పడింది. దాతో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ వరకు కూడా ఏవి లేవు. రీసెంట్ టైమ్ లో నాగ చైతన్య కెరీర్ లోనే లో వరస్ట్ ఓపెనింగ్స్ ఇప్పుడు సినిమా సొంతం చేసుకుంది.
ఇంత దారుణమైన ఓపినింగ్స్ రావటానికి కారణం నిర్మాత,డిస్ట్రబ్యూటర్ గా దిల్ రాజు తీసుకున్న నిర్ణయాలే అంటున్నారు. ఆంధ్రాలో ముందురోజే ప్రీమియర్ షోలు వేయటం దెబ్బ కొట్టిందని చెప్తున్నారు. నెల్లూరులోని ఎస్2 సినిమాస్, భీమవరంలోని ఏవీజీ సినిమాస్, విజయవాడలోని క్యాపిటల్ సినిమాస్ తో పాటు వైజాగ్ జగదాంబ థియేటర్, రాజమండ్రి శ్యామల థియేటర్లలో ఈ స్పెషల్ ప్రీమియర్ షోస్ వేసారు. సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియాలో ...సినిమా సోసోగా ఉందని ప్రస్దావించటం... ఉదయం థియేటర్ కు వెళ్దామనుకువాళ్ళని ఆ టాక్ ఆపేసిందని చెప్తున్నారు. ఇక నైజాంలో టిక్కెట్ రేట్లు తగ్గించకపోవటం సినిమాకు మైనస్ గా మారిందని అంటన్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ చేసిన పొరపాటు సినిమాని దారుణంగా దెబ్బ తీసిందని విశ్లేషిస్తున్నారు.
దిల్ రాజు నిర్మించిన జోష్ సినిమాతోనే నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ దిల్‌రాజు సంస్థలో నాగచైతన్య చేసిన సినిమా ఇది. ఇందులో రాశీఖన్నా, మాళవికానాయర్, అవికాగోర్ హీరోయిన్లుగా నటించారు.