వెనకటికొకడు నేను చచ్చైనా నిన్ను విధవను చేస్తా అన్నాడట...అది నిన్నటి నంద్యాల బాబు ప్రచారంలో అర్ధమైంది...
శిల్పా సహకార్ అంటూ గత కొన్నేళ్లుగా మహిళల స్వయం ఉపాధికి రుణాలు ఇస్తున్నారు..ఇవి వడ్డీలేని రుణాలు..కానీ ఆ విధంగా ఇవ్వడం కుదరదని చట్టాల్లో ఉందని నామ మాత్రపు వడ్డీకి ఇస్తున్నట్టు రాసుకుని వడ్డీని శిల్పా సహకార్ వారే చెల్లిస్తున్నారు...
ఈ రుణంతో స్వయం ఉపాధి మొదలుపెట్టి ఎందరో మహిళలు తమ కుటుంబాలను చక్కదిద్దుకున్నారు..
ఈ రుణం తీసుకున్న మహిళలు కృతజ్ఞతాభావం తో శిల్పా కు ఓటు బ్యాంకుగా మారారు...
ఇంకేముంది?నాది ఒక కన్ను పోయినా పరవాలేదు,ఎదుటోడి కళ్లు రెండూ పోవాలనే మనస్తత్వం ఉన్న రాజకీయప్రత్యర్ధులు వీరి మీద అభాండాలు వేయడం మొదలు పెట్టారు..
ఈ సన్నాసుల వ్యవహారం అమ్మ పెట్టదూ,అడుక్కతిననీయదు సామెతలా..వారు సాయం చేయకపోగా శిల్పా సహకార్ సభ్యులు మహిళలను కించపరచేలా మాట్లాడారు..ఇంకా ఎన్నో పనికిమాలిన కూతలు ప్రచారంలోకి తెచ్చారు...అసలీ వెధవలకు స్వయం ఉపాధి మహిళలను కించపరుస్తున్నామన్న ఇంగితం లోపించి ఈ చవకబారు ప్రచారం సాగించారు...
ఈ బేవార్సు వాగుడు గత ఎన్నికల్లో పుకార్లగా వ్యాపింపజేస్తే ఈసారి పత్రికల్లో నిర్లజ్జగా మాట్లాడ్డం మొదలు పెట్టారు...
ఒకానొక సమయంలో దీన్ని మూసేయాలని కుటుంబసభ్యులు భావించినా మోహన్‌రెడ్డి ఒప్పుకోలేదు...
అప్పట్లో నంద్యాల వచ్చిన చంద్రబాబు శిల్పా సహకార్,శిల్పా సూపర్ మార్కెట్(తెల్లరేషన్ కార్డ్ వారికి నిత్యావసర వస్తువులు 10-15% mrp కన్నా తక్కువకు అందిస్తున్నారు)ల గురించి తెలుసుకుని అభినందించారు...
*** *** ***
undefined
ఇప్పుడు చూస్తే నంద్యాల చివరిరోజు పర్యటనలో నానా అభాండాలు వేసి ముఖ్యమంత్రి స్థాయినే దిగజార్చారు.కుందులో ప్రమాదవశాత్తు చనిపోయిన అమ్మాయిలది అనుమానాస్పద మరణం,దానిపైన విచారణ జరిపిస్తా అని నిర్లజ్జగా మాట్లాడుతున్నాడు...
అసలు ఈ వార్త కానీ..అనుమానాస్పద మృతి అని కానీ ఎన్నడూ వార్తల్లో చదివిన,చూసిన గుర్తు లేదు...
అసలు నంద్యాల ఊరనుకున్నాడా?వల్లకాడనుకున్నాడా?
ఏం బాబూ..గత 3 ఏళ్లుగా శిల్పా సోదరులు తెదేపా లో ఉన్నప్పుడు ఈ విచారణలు గుర్తురాలేదా?
అంటే మీ పార్టీలో ఉంటే ఎంతటి పాపాల భైరవులనైనా కాపాడుతుంటావా?
అవున్లే...
ఇసుకలో ఈడిఈడ్చి తన్నిన వనజాక్షిని తన్నిన పెద్దమనిషి..
అప్పు తీసుకున్నందుకు ఆవిడతో వ్యభిచారం..ఆ తర్వాత ఆవిడ కూతురు..ఆ పైన ఆ అమ్మాయి స్నేహితురాళ్లనూ నాశనం చేసిన కాల్‌మనీ గాళ్లను కాపాడే గొప్ప సంస్కృతి కదా తమరిది....
గెలుపుకోసం ఇంత నీచానికి దిగజారాలా బాబూ...
*** *** ***
నంద్యాలలో ఏనాడూ అత్యాచార కేసులు వినలేదు కానీ 30 ఏళ్ల క్రితం కర్నూల్ కెవిఆర్ కాలేజీలో లో మాధవిలత,విద్యావతి అనే ఇద్దరమ్మాయిల అత్యాచారం,హత్య కేస్ అప్పట్లో సంచలనం.ఇంతకూ అదెవరు చేసారో? ఇంతకూ, కాల్‌మనీ దోషుల విచారణ ఎంతవరకు వచ్చిందో?
మరిన్ని తాజావార్తల కోసం క్లిక్ చేయండి