ఇలా జరిగే ప్రమాదమూ ఉందా???

First Published Nov 26, 2016, 6:59 AM IST
Highlights

ఆ మూడు నాలుగు లక్షల కోట్లు ఇక రావను కుందాం.

 

 అది ప్రభుత్వం లాభం గా ప్రకటించుకుని టాక్స్ లు తగ్గిస్తుందని అందరం అనుకుంటూ ఉన్నాం. ఒక వేల, ఖర్మ కాలి అలా జరగకపోతే ఏమి అవుతుందో చూద్దాం.

 

ఇది ఊహాత్మక పరిస్థితే కాని అలా జరిగే అవకాశాలు లేక పోలేదు.

 

1991 జనవరి ఇరవై రెండో తేది సోవియట్ యూనియన్ యాభై, వంద రూబుల్ నోట్ లు రద్దు చేసింది. ఉన్న డబ్బు అంతా మార్చుకోండి అది కూడా మనిషికి వెయ్యి రూబుల్స్, కేవలం మూడు రోజుల్లో మాత్రమె అని ఆర్డర్ వేసింది. ప్రతి బాంక్ అకౌంట్ కి నెలకి ఐదు వందల రూబుల్స్ మాత్రమె విత్ డ్రా లిమిట్ పెట్టింది.

 

సామాన్య ప్రజలు అందరూ కేవలం మూడే రోజుల్లో పేద వాళ్ళు అయిపోయారు. పెద్ద గద్దలు ముందు గానే విషయం తెలుసుకుని వాళ్ళ డబ్బు మార్చేసుకున్నారు. రష్యన్ బ్యూరోక్రాట్ లు మన వాళ్ళ లాగే విపరీతమయిన అవినీతి పరులు కావడం తో వాళ్ళ డబ్బు ని అమెరికన్ డాలర్ లకి హవాలా లో మార్చేసుకున్నారు. అఫీషియల్ గానే డాలర్ కి రూబుల్ ఇరవై నుంచి ముప్ఫై ఆరు అయ్యింది. అనఫిషియల్ గా వంద రూబుల్స్ ఒక డాలర్ అయ్యి, డబ్బు దేశం దాటింది.

 

కాష్ లేక పోవడం వల్ల తగ్గిన ఆహార ధరలు ఆకాశం లోకి వెళ్ళాయి. తినే రొట్టె, బీఫ్ లాంటివి ఏడు వందల శాతం పెరిగాయి. ప్రజల దగ్గర డబ్బు లేదు. అంతకు ఒక నెల ముందే గోర్భచేవ్ వెళ్లి పోయి ఎల్త్సిన్ వచ్చాడు. To cut the long story short.. సోవియట్ యూనియన్ మళ్లీ రష్యన్  ఫెడరేషన్ అయ్యింది.

 

ఇప్పుడు మన దగ్గర చూద్దాం. బాంక్ ల లోకి ఆరు లక్షల కోట్లు వచ్చింది. కాని లక్ష కోట్లు మాత్రమె విత్ డ్రా అయ్యింది. ఎందుకంటే విత్ డ్రా లిమిట్స్ ఉన్నాయి కాబట్టి. ఒక వేల విత్ డ్రా లిమిట్స్ తీసేస్త ఈ డబ్బు వెనక్కి వెళ్తుంది. ఒక వేల నిజంగా ఆరు లక్షల కోట్లు విత్ డ్రా జరిగితే నాకు తెలిసి ఈ దేశం లో స్టేట్ బాంక్ ఏమన్నా బతుకుతుందేమో కాని, ఇక వేరే ఏ బాంక్ కూడా ఉండదు. కొలాప్స్.

 

ఒక వేళ మొత్తం పదిహేడు లక్షలు వెనక్కి వచ్చేస్తే మాత్రం కొంప కొల్లేరే. అంత డబ్బు రీప్లేస్ చెయ్యాలి అంటే రెండేళ్ళు పడుతుంది. ఆ లోపు ఆ డిపాజిట్ లకి వడ్డీలు కట్టలేక బాంక్ లు మునుగుతాయి. రైతులు ఇప్పుడు పానిక్ సెల్లింగ్ చేస్తున్నారు కాబట్టి ధరలు తగ్గి ఉన్నాయి. పైగా బంపర్ వర్షాల వల్ల తిండి కొరత లేదు, ఒక వేల తిండి కొరత వస్తే మాత్రం ఆహార ధాన్యాలు, పాలు, మాంసం ధరలు ఆకాశం లోకి వెళ్తాయి.

 

ఇప్పుడు అఫీషియల్ గా అరవై ఎనిమిది రూపాయలు ఉన్న డాలర్, బ్లాక్ లో వంద ఉంది. డిసెంబర్ మూడో వారానికి అఫీషియల్ గా డాలర్ వంద అవుతుంది. అలా అయితే పెట్రోల్, డీజిల్ లీటర్ వంద అవుతుంది. అదే జరిగిన పక్షం లో పాలు లీటర్ వంద అవుతాయి. బియ్యం కేజీ వంద, ఇలా అన్నీ వంద అయిపోయి, వంద కి కింద ఉన్న డబ్బు కి విలువ పోతుంది.

 

లార్జ్ స్కేల్  అశాంతి మొదలు కావచ్చు. ప్రభుత్తానికి  ప్రజామోదం సన్నగిల్లుతుంది. చివరికి అది ఎక్కడికి దారి తీస్తుందో చెప్పలేం. ఇలా జరుగుతుందో లేదో నాకు తెలీదు. వీటిలో కొన్నయినా తప్పకుండా జరుగుతాయి.

 

డాలర్ మాత్రం వందకి పోవడం ఖాయం. అదీ తాత్కాలికమే అనుకోండి. మళ్ళీ వెనక్కి వస్తుంది. విత్ డ్రా లిమిట్స్ మాత్రం ఇప్పట్లో పోవు. ప్రభుత్వం అలా అనుమతించి బాంక్ ల కల్లోలానికి దారి తియ్యదు. ప్రభుత్వం చెయ్యాల్సిన కొన్ని అర్జెంట్ పనులు ఉన్నాయి. వెంటనే అవసరం అయినంత ఫుడ్ స్టాక్ పెట్టుకోవడం, వడ్డీ రేట్ లు అర్జెంట్ గా తగ్గించి ఆరు శాతం దగ్గరికి తీసుకు రావడం. ఇంకం టాక్స్ పది శాతం తగ్గించడం, ఎందుకంటే వచ్చే నాలుగు నెలలు కీలకం. ఆహార ధరలు పెరగొచ్చు.

 

ఇది తాత్కాలికమే, ఒక వేల నిజంగా మూడు లక్షల కోట్లు రాదు అనుకుంటున్న డబ్బు వెనక్కి వచ్చిందా...........ఎన్నికష్టాలొస్తాయో వూహించండి. అంతా మీ వూహా శక్తికి వదిలేస్తున్నా.

click me!