ససిగలా సబదం... సస్పెన్స్ ధ్రిల్లర్

 |  First Published Feb 16, 2017, 8:45 AM IST

స్వతంత్ర భారతంలో సమాజంలో నిట్టనిలువు చీలిక తెచ్చిన సంఘటనల్లో ఒకటి గ్లోబలైజేషన్.ఎన్నడూ వినని వేల కోట్లు,లక్షల కోట్లు అనే మాటలు.ఎక్కడ చూసినా వ్యవస్థీకృత అవినీతి.సంపాదనకేనా?సినిమా టికెట్ల నుంచి తిరుమల దర్శనాల వరకూ దొడ్డిదారులే...

 

Latest Videos

undefined

ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 90వ దశకంలోని 65 కోట్ల బోఫర్స్,66 కోట్ల జయలలిత అక్రమాస్తుల కేసులు ఇప్పుడు చాలా చిన్నవి అనిపిస్తాయి..కారణం ఒక మోస్తరు మునిసిపాలిటీ,కార్పోరేషన్లలో 100 కోట్ల స్థలాల కబ్జాలు చేస్తున్నారు..ఏ ప్రాజెక్ట్ చూసినా వేల కోట్ల అవినీతే...

 

నిజంగా రాజకీయాల్లో ఏ పార్టీ అయినా రాజకీయం కాకుండా సేవ చెయ్యటానికొచ్చారా?ఎత్తులు పై ఎత్తులు...

 

 

సరే..మనం మాట్లాడుకుంటుంది తమిళనాడు రాజకీయాలు కాబట్టి మన్నారుగుడి మాఫియా అంటూ అందరూ శశికళను దుమ్మెత్తిపోస్తున్నారు...జయ కు స్లో పాయిజన్ ఇచ్చింది,ఆవిడ చనిపోయిన కొన్ని నెలలకు వెల్లడించారు,ఆవిడ కాళ్లు ముందే తీసేసారంటూ....చివరికి మొన్న పన్నీర్ సెల్వం కూడా వచ్చి నన్నూ చూడనివ్వలేదన్నాడు...

 

----ఇక్కడ భాజపా భక్తులంతా అసలు ఈ రాజకీయాలతో మాకేం సంబంధం? కోర్టులను మేము ప్రభావితం చెయ్యగలమా అనే కబుర్లు చెబుతున్నారు...ఈ విషయం పక్కన పెడితే జయలలిత హాస్పిటల్లో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులు,గవర్నర్ కూడా వెళ్లి చూసారు...

 

ఈ రోజు ప్రజాస్వామ్య రక్షకుడని చెబుతున్న గవర్నర్ ఎందుకు ఆవిడ ఆరోగ్య రహస్యం చెప్పలేదు?

 

ఈయనా ఆ మాఫియాకు భయపడ్డాడా? లేక జనాల్లో శశికళ మీద అపోహలు పెంచి పార్టీని నిర్వీర్యం చేసి తమిళ కోటలో పాగా వేద్దామనుకున్నాడా? ఎంత సేపూ ఆ లండన్ డాక్టర్తో చెప్పించడం తప్ప ప్రజల అపోహలు దూరం చేసే బాధ్యత రాష్ట్ర ప్రధమ పౌరుడికి లేదా?

 

గత వారం రోజుల సంఘటనలే చూస్తే మెజారిటీ శాసన సభ్యులు ఎన్నుకున్న వ్యక్తికే బల నిరూపణకు అవకాశమివ్వకుండా గవర్నర్ ఎందుకు ఆపాడు?

 

నిజంగా మనదేశంలో అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు,మంత్రులను వారి మీదున్న అభియోగాలపైన కోర్ట్ తీర్పులొచ్చాకే ప్రమాణ స్వాకారం చేయిస్తున్నారా?సరే శశికళ శాసన సభ్యురాలు కాదనుకున్నా 6 నెలల్లో ప్రజాప్రనిధి అవ్వాలన్న వెసులుబాటు రాజ్యాంగం లో ఉంది కదా?ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం లో పీ.వీ.నరసింహా రావు ను ప్రధాని చేసాకే నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఎన్నుకోలేదా?మన్మోహన్ సింగ్ రెండు సార్లూ రాజ్యసభ సభ్యుడు కాదా?

 

ఇందులో మా రాజకీయం లేదు లేదంటూనే భాజపా ఎన్ని వేషాలెయ్యలేదూ!పాపం వాళ్ల నాయకులు రజనీకాంత్ తో మంతనాలు జరపలేదా?

 

ఇక్కడ పాపం ఆ రజనీ బాబా గురించీ చెప్పుకోవాలి...ఒకానొక ఎన్నికల సమయంలో హడావుడిగా విదేశీ యాత్ర నుంచి వచ్చి జయకు ఓటేస్తే దేవుడు కూడా రాష్ట్రాన్ని కాపాడలేడన్నాడు..మొన్న ఆవిడ పోయాక ఆ మాట తలుచుకుని ఒక సభలో కన్నీళ్ల పర్యంతమయ్యాడు...ఇక మనోడు అప్పట్లో పడయప్ప/నరసింహ అనే సినిమా తీసి ఆడ విలన్ నీలాంబరిని పెట్టి విజయం సాధించాడే తప్ప నిజానికి అంత ధైర్యం లేదు..ఆ తర్వాత సొంత సినిమా బాబా లోనూ రాజ్యమా,సన్యాసమా అంటూ ఒక పాట,శక్తినివ్వూ అంటూ మరో అర్ధం కాని పాటతో సరిపుచ్చాడు...అంత వీరుడీ నరసింహ!!!

 

సరే మొత్తానికి చిన్నమ్మగా పిలవబడే శశికళ జైల్లో కూర్చుంది...అయితే మాత్రం ఇక్కడ భాజపా పప్పులుడకలేదు....పాపం ఎంతగా వత్తి పిండినా  సెల్వం నుంచి పన్నీరు కారలేదు.  .ఇన్నిరోజుల సమయమిచ్చినా పట్టుమని పదిమందిని లాక్కోలేని వాజమ్మ అని అర్ధమై పళణి స్వామికి గవర్నర్ అవకాశమివ్వక తప్పలేదు.ఈయన రాబోయే 15 రోజుల్లో బలనిరూపణ చేసుకోగలడనే అనుకుంటున్నా....మిగిలిన రాష్ట్రాలతో పోలుస్తే తమిళనాట తీవ్ర భావోద్వేగాలుంటయి..మన తెలుగు,ఇతర రాష్ట్రాల్లో సంతలో పశువులను కొన్నంత సులభం కాదక్కడ కొనడం...

 

అసలు తమిళనాడు లోని కొన్ని గ్రామాల్లో కొన్ని ఇల్లు చూస్తే వింతగా అనిపిస్తాయి..ఇంటి మీదో,పోర్టికో మీదో ఏకంగా పార్టీ గుర్తులను శాశ్వత కట్టడలుగా కట్టుకుని ఉంటారు.

 

ఇంతా చేసి నిన్నటి "ససిగలా సబదం" మాటేంటంటరా?

అసలైన పడయప్ప/నరసిమ్హ చూడబోతున్నామనే నా అభిప్రాయం..

పురచ్చి తలైవి(విప్లవనాయకి)నే తన గుప్పిట ఉంచుకున్న శశికళకు శాశన సభ్యులొక లెక్కా?

ఇప్పటికే 6 నెలల కారాగారం అనుభవించింది..ఇక మిగిలింది మూడున్నరేళ్లే...అంటే సరిగ్గా వచ్చే ఎన్నికలనాటికి విడుదలవుతుంది.....

చూడ్డాం బయటికొచ్చాక ఏ పాచికలేస్తుందో..ఏ ఎత్తుకు పై ఎత్తు వేస్తుందో....

ఈలోగా నటుడు అజిత్ నూ రంగంలోకి దింపే అవకాశాలు లేకపోలేదు....

అజిత్ గురించీ చిన్న ముచ్చట....ఒక్కో హీరో విగ్గులకే వందల సార్లు నల్లరంగు పులుముతుంటే ఇంకా 50 దాటని ఈ హీరో తెల్లజుట్టు,గడ్డం తో సినిమాల్లో కనిపిస్తాడు....

 

మొత్తానికి శశికళ శపధాన్ని తక్కువ అంచనా వేయలేము..ఏమో గుర్రం ఎగరా వచ్చు....

click me!