కేసీఆర్ వండి వార్చుతున్న మతభోజనాలు!

 |  First Published Nov 10, 2017, 6:44 PM IST

కార్తీక మాస వన భోజనాలు చూసినం. అవి కార్తీక మాస కుల భోజనాలు అని కూడా తెలుసు. 

ఇపుడు తెలంగాణ ముఖ్యమంత్రి స్పాన్సర్ చేస్తున్న కార్తీక మాస మత భోజనాలు !! 

Latest Videos

undefined

 

సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం... కొంతమంది తెరాస నాయకులు ప్రైవేట్ గా మాట్లాడుతున్న విషయాల ప్రకారం ... ఈరోజు 51 పొట్టేళ్ళతో కందూర్ (దర్గా దగ్గర చేసే జంతుబలి, దావత్) చేసి, తెలంగాణ కోసం మొక్కిన మొక్కు తీర్చుకున్నరని తెలియవస్తున్నది. 

ఇది నిజమయితే గనక, దారుణాతిదారుణం. హేయం.

తెలంగాణ ఒచ్చింది మీ ముక్కుపుడకలు, వజ్రపు కిరీటాలు, జంతుబలుల మొక్కుల వల్లనా? తెలంగాణ బిడ్డల త్యాగాల వల్ల కాదా?  తొలిదశ ఉద్యమంలో తూటాలకు ఒరిగిన 369 మంది ఈ గడ్డ బిడ్డల ఆత్మార్పణ వల్ల కాదా? మీరే ముఖ్యమంత్రి హోదాలో జూన్ 15, 2014న నిండు అసెంబ్లీలో చెప్పినట్టు 1250 మంది మలిదశ ఉద్యమవీరుల పోరాటం లేదా తెలంగాణ సాధనలో?

తెలంగాణ ఏమన్న మీ జాగీరా? మీ ఇష్టం వచ్చినట్టు కుల, మతాల వారీగా తెలంగాణ సమాజాన్ని విభజించి పాలించాలని చూస్తున్నారు?  ఇపుడు ఏకంగా జంతుబలులకు తెగబడుతున్న మీరు పెట్టిస్తున్న మతభోజనాలు తెలంగాణ సమాజం పాలిట విషాహారం కంటే తక్కువ కాదు. 

మరి ఈ జంతుబలుల పట్ల అక్కినేని అమల ఏం మాట్లాడుతారో? చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత ఏమంటారో?  

ఏమనుకుంటున్నారు మీరు? ఎక్కడికి తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని? 

ముస్లింలకు జనాభా మొత్తానికి రిజర్వేషన్లు ఇస్తాం అంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం.  ముస్లిం మిత్రులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఆ ట్రాప్ లో పడొద్దు. ఈ రిజర్వేషన్లు రావు. బీసీలకు గొర్లు బర్లు చేపలు అంటున్న ముఖ్యమంత్రి గారూ, వారి రిజర్వేషన్లు పీకేసి ముస్లింలకు ఇస్తాం అనే కదా మీ ఉద్దేశం? బీసీ యువతీ యువకుల్లారా ఆలోచించండి. ఇప్పటికే మీకు చదువులు వొద్దు అని స్కూళ్ళు మూసేస్తూ, ఫీజు రీఎమ్బర్సుమెంటు ఎత్తేస్తూ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రహసనంగా మార్చేస్తూ, ఉద్యోగాల ఆశ ఎండపెడుతూ, రేపు మీ భవిష్యత్తును బొంద పెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి.

ఇపుడు ముస్లింలకు గాలం వేయడానికి కొత్త నాటకాలకు తెరతీస్తున్నాడు. 

ఈ భజన రాజకీయాలు, విభజన రాజకీయాలు హేయం. మీ మయసభలో కూర్చుని ఏదేదో అనుకుంటున్నారు. గర్వభంగం తప్పదు. ఉద్యమకారులను విస్మరిస్తున్నారు. వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాండూర్ ఆయూబ్ ఖాన్ చావుకు కారణం అయిన మహేందర్ రెడ్డి నేటికీ యువతపై, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడు. ప్రశ్నించిన వారిని పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నారు. 

 

సకల జనులకు నరకం చూపిస్తున్న, ఉద్యమ ఆకాంక్షలను విఫలం గావించిన ఈ తెరాస ప్రజా వ్యతిరేక పాలనపట్ల తెలంగాణ సమాజం జాగరూకులు కావాలి. 

తెలంగాణ బిడ్డలు ... వింటున్నారా? 

click me!