యుద్ధం అనివార్యమైన చోట  సంధికి సందుండొద్దు

Asianet News Telugu  
Published : Oct 01, 2017, 05:18 PM ISTUpdated : Mar 28, 2018, 04:59 PM IST
యుద్ధం అనివార్యమైన చోట  సంధికి సందుండొద్దు

సారాంశం

కంచె ఐలయ్య అరెస్ట్ కు రంగం సిద్ధం...
.....................................................

రాజ్యామా...
భావాలను బంధించగలవా
అక్షరాలను అరెస్ట్ చెయ్యగలవా
 
వేల సంవత్సరాలుగా
ఎవడి మనో భావాలు ఎంతగా 
దెబ్బ తిన్నాయో లెక్కలేద్దామా

ఎవడి గూడెంలో ఎన్ని శవాలు 
పోయాయో సమాధులు లెక్కలేద్దామా
మనుధర్మంతో ఎవరివి ఎన్ని మానాలు 
పోయాయో లెక్కలు తీద్దామా 

ఒక్క పుస్తకానికి మీరు గింజుకుంటున్నారే
మీ బ్రాహ్మణులు టన్నులుకొద్ది పుస్తకాలు రాసి
మా మనోభావాలను కించపరిచారు
మీ లెక్క ప్రకారమే మేము ఎంత మందిని
 మేము తెగ నరకాలో లెక్కలేద్దామా 

చట్టమా...

ఎస్.సి. లుగా ఎవడు పుడతాడన్న
చంద్రబాబు నీ కంటికి కనబడలేదా ?
ఎస్.సి. ఎస్.టి. లకు రిసర్వేషన్స్ వద్దంటూ
మాట్లాడిన ఆది నారాయణరెడ్డి  చూడలేవా ?
 మంథని మధుకర్, బోన్గిరి నరేష్ లు మరణం
జరిగినప్పుడు కళ్ళలో జిల్లెళ్లు పోసుకున్నావా ?
చట్టమా నువ్వెంత సిగ్గుమాలిన దానివే
నిన్ను బట్టాలిప్పి తాన్నినా నీకు సిగ్గురాదే
ఈ దేశంలో...

మనువాదుల్లారా సిద్ధం కండి
పొట్లాలు కట్టుకునే వాVళ్లకు 
పట్టాలు అందుకున్న వారికి మధ్య 
లడాయి జరగవలసిందే...
యుద్ధం అనివార్యమైన చోట 
సంధికి సందుండొద్దు..

 

 

(సోషల్ మీడియా నుంచి)

PREV
click me!

Recommended Stories

S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?