మరో కీలక నిర్ణయం దిశగా జగన్... త్వరలో ప్రభుత్వ ప్రకటన: ఎమ్మెల్యే గోపిరెడ్డి

Arun Kumar P   | Asianet News
Published : Jan 30, 2020, 04:39 PM IST
మరో కీలక నిర్ణయం దిశగా జగన్... త్వరలో ప్రభుత్వ ప్రకటన: ఎమ్మెల్యే గోపిరెడ్డి

సారాంశం

అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి మరో కీలక ప్రకటన వెలువడనుందని వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెెల్లడించారు. 

గుంటూరు: ఇప్పటికే రాజధాని మార్పు, మండలి రద్దు వంటి  కీలక నిర్ణయాలు తీసుకున్న వైసిపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి తెలిపారు. పాలనా సంస్కరణల్లో భాగంగా జిల్లాలను విభజించాలని నిర్ణయం తీసుకుందని... త్వరలో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడనుందని అన్నారు. 

ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి మరికొంత కాలం సమయం పడుతుందన్నారు. అన్ని నియోజకవర్గాలకి సెంట్రల్ లో ఉన్న నరసరావుపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిదన్నారు. అందరికి అందుబాటులో ఉండేలా జిల్లాని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా హెడ్ క్వాటర్స్ రేసులో నరసరావుపేట ఎప్పుడు ముందంజలో ఉంటుందని...స్ధానిక ప్రజలు ఆందోళన చెందవద్దని గోపిరెడ్డి సూచించారు.   

read more  సరిలేరు నీకెవ్వరు... సినిమా డైలాగులతో జగన్ పై బుద్దా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు

పార్లమెంట్ పరిదిలో ఉన్న నియోకవర్గాలను దృష్టిలో వుంచుకుని జిల్లాల ఏర్పాటు వుండబోతోందన్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిందని అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా వుండేలా నూతన జిల్లాల ఏర్పాటు వుండనుందని గోపిరెడ్డి వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Jubilee Hills లో కాంగ్రెస్ గెలవడానికి టాప్ 10 రీజన్స్ ఇవే...