కుటుంబంలోని మహిళలతో అక్రమ వ్యాపారం...దిగజారిన జేసి..: కేతిరెడ్డి సంచలనం

By Arun Kumar PFirst Published Feb 8, 2020, 2:27 PM IST
Highlights

మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి కుటుంబంపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అనంతపురం: మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని తాడిపత్రి వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ఇంతకాలం జేసి బ్రదర్స్ పేరుతో సాగిన ఈ అక్రమ దందా ఇప్పుడు వారి కుటుంబసభ్యలు  భాగస్వామ్యమయ్యారని అన్నారు. తమ కుటుంబంలోని మహిళల పేరుతో జేసి అక్రమ వ్యాపారానికి తెరతీశారని మండిపడ్డారు. 

దివాకర్‌ రెడ్డి సోదరుల ట్రాన్స్‌పోర్టు వ్యాపారమంతా ఫోర్జరీ సర్టిఫికెట్లతోనే నడుస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు.  దివాకర్ ట్రావెల్స్ కి చెందిన వాహనాల ఎన్‌వోసీ తో పాటు ఇతర దృవపత్రాలు కూడా నఖిలీవేనని... గతంలో అధికారుల సహకారంతోనే వీటిని  పొందారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తనవద్ద వున్నాయంటూ కేతిరెడ్డి మీడియా ముందు ప్రదర్శించారు. 

READ MORE  సినిమాల్లో లాగా కాల్చిపారేయలేం: అత్యాచార ఘటనలపై వైఎస్ జగన్

టిడిపి అధికారంలె వుండగాం జేసి ఇలాంటి అక్రమాలు ఎన్నో చేశారన్నారు. ఎంపీ సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమాదేవి పేరున 84 బస్సులు ఉన్నాయని... వాటికి సంబంధించిన పత్రాలు కూడా నకిలీవేనని పెద్దారెడ్డి ఆరోపించారు. ఇలా జేసి సోదరులే కాకుండా వారి ఇంట్లోని మహిళల పేరుతో కూడా అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. 

ఇప్పటికే రవాణా శాఖ అధికారులు దివాకర్ ట్రావెల్స్ అక్రమాలను బయటపెడుతున్నారని అన్నారు. ఎక్కడికక్కడ ఆ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేస్తూ అక్రమ పత్రాలతో నడుస్తున్న వాటిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.  ఈ మోసాలకు సంబంధించి ఇప్పటికే పలుచోట్ల కేసులు కూడా నమోదయ్యాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలిపారు. 

జేసి కుటుంబ అక్రమాలకు సంబంధించిన ఆధారాలన్నీ తనవద్ద వున్నాయని... వారం రోజుల్లో మరోసారి మీడియా ముందుకు వచ్చి వాటన్నింటిని  బయటపెడతానని హెచ్చరించారు. జేసి దివాకర్ రెడ్డి అక్రమాలను అడ్డుకుని తీరతానని కేతిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 

click me!