ఎవరూ పెళ్లిచేసుకోవడం లేదని.. ఉద్యోగానికి కానిస్టేబుల్ రాజీనామా

By telugu teamFirst Published Sep 12, 2019, 11:06 AM IST
Highlights

కానిస్టేబుల్ గా అధిక పనిగంటలు, పని ఒత్తిడి, ప్రమోషన్లు లేకపోవడం వల్ల తనను పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకు రావడం లేదనే వేదనతో ప్రతాప్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎన్నో కలలతో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరితే, కనీసం తనతో పెళ్లికి పలువురు అమ్మాయిలు తిరస్కరించారని ప్రతాప్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 
 
పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఓ కానిస్టేబుల్ ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని చార్మినార్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... హైదరాబాద్ నగరానికి చెందిన సిద్ధాంతి ప్రతాప్ (పీసీ 5662) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. ప్రతాప్ పోలీసు శాఖపై ఆసక్తితో 2014లో చార్మినార్ పోలీసుస్టేషనులో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరాడు. కాగా... గత కొంతకాలంగా అతనికి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే... కానిస్టేబుల్ ఉద్యోగమని తెలిసి ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు.

 కానిస్టేబుల్ గా అధిక పనిగంటలు, పని ఒత్తిడి, ప్రమోషన్లు లేకపోవడం వల్ల తనను పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకు రావడం లేదనే వేదనతో ప్రతాప్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎన్నో కలలతో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరితే, కనీసం తనతో పెళ్లికి పలువురు అమ్మాయిలు తిరస్కరించారని ప్రతాప్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 

సబ్ ఇన్ స్పెక్టర్లు, ఉన్నతాధికారులకు మాత్రం ప్రమోషన్లు కల్పిస్తున్నారని, కానీ కానిస్టేబుళ్లు మాత్రం ఏళ్ల తరబడిగా అదే పోస్టులో కొనసాగుతున్నారని ప్రతాప్ పేర్కొన్నారు. మా సీనియర్ కానిస్టేబుళ్లు కొందరు 30, 40 ఏళ్లపాటు కానిస్టేబుళ్లుగానే పనిచేస్తూ పదవీ విరమణ చేశారని ఆయన పేర్కొన్నారు. తమ కానిస్టేబుళ్లకు వీక్ లీ ఆఫ్ లు లేవని, కొన్నిసార్లు సెలవులు కూడా దొరకవని, ట్రాఫిక్ పోలీసులు సాధారణ విధులు నిర్వర్తించాక అదనంగా రాత్రి పది గంటల నుంచి యాంటీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పరీక్షల తనిఖీల్లో పాల్గొనాల్సి వస్తుందని ప్రతాప్ పేర్కొన్నారు.

 కానిస్టేబుల్ గా పనిచేస్తున్నందుకే తనను అమ్మాయిలు పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదని, అందుకే తాను కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదిలివేస్తున్నానని ప్రతాప్ రాజీనామాను సమర్పించారు.

click me!