గేదె కనపడట్లేదని చిలక జోస్యం.. మూఢనమ్మకాలంటూ చితకబాదిన పోలీసు

By telugu news teamFirst Published Apr 14, 2020, 8:43 AM IST
Highlights
రాంబాబు అనే వ్యక్తి గేదెలు ఎటో వెళ్లిపోయాయి..అవి కనపడలేదని చిలక జోస్యం చెప్పించుకున్నాడు. ఆ జోస్యంలో అనంతవరం గ్రామానికి చెందిన బాణావత్.నాగేశ్వరవు వద్ద గెదలు ఉన్నట్లు చెప్పారు.
 
ఓ వ్యక్తి తన గేదెలు కనిపించకుండా పోయాయనే బాధతో చిలక జోస్యం చెప్పే వ్యక్తి వద్దకు వెళ్లాడు. అది ఓ పోలీసు కంట పడింది. దీంతో.. ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు ఏంటి అంటూ.. సదరు వ్యక్తిని చితకబాదాడు. దీంతో.. కారణం చెప్పకుండా పోలీసు తనని కొట్టాడని..దాని వల్ల తన పరువు పోయిందని సదరు వ్యక్తి నానా యాగీ చేశాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా అనంతవరం గ్రామాన్ని చెందిన ఉదారపు. రాంబాబు అనే వ్యక్తి గేదెలు ఎటో వెళ్లిపోయాయి..అవి కనపడలేదని చిలక జోస్యం చెప్పించుకున్నాడు. ఆ జోస్యంలో అనంతవరం గ్రామానికి చెందిన బాణావత్.నాగేశ్వరవు వద్ద గెదలు ఉన్నట్లు చెప్పారు.

ఇదే విషయాన్ని రాంబాబు అంతవరంలో కరోనా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ, చాందిని అనే కానిస్టేబుల్స్ కి చెప్పారు. అతను చెప్పింది వినిపించుకోని పోలీసులు... ఈ కాలంలో మూఢ నమ్మకాలంటి అంటూ హేలన చేశారు. అంతేకాకుండా కులం పేరుతో దూషించి చితకబాదారు.

కారణం చెప్పకుండా తనను లేడీ కానిస్టేబుల్ ఎదుట కొట్టాడంటూ సదరు బాధితుడు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు వాపోగా.. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
click me!